పాడి పంట | Dairy farm | Sakshi
Sakshi News home page

పాడి పంట

Published Sat, Jul 30 2016 5:55 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

పాడి పంట - Sakshi

పాడి పంట

  • వర్మీవాష్‌తో తెగుళ్ల నివారణ
  • సేంద్రియ ఎరువుతో తయారీ
  • క్రిమిసంహార ఎరువులకు బదులుగా..
  • ఏఓ రెబల్‌సన్‌ సలహాలు, సూచనలు
  • వ్యవసాయశాఖ అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పంటలకు తెగుళ్లుసోకితే వాడే రసాయనాలకు (పురుగు మందు) బదులుగా ‘వర్మీవాష్‌’ను ప్రోత్సహిస్తున్నారు. పేడ, ఎండుగడ్డి, కుళ్లిపోయే చెత్తాచెదారంలో వానపాములు వేసి సహజసిద్ధమైన వర్మీవాష్‌ అనే ద్రవపదార్థాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు. దీనివల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. అధికారుల సూచనలు పాటిస్తోన్న ఎంతోమంది రైతులు వర్మివాష్‌ తయారీకి మొగ్గుచూపుతున్నారు. వర్మీవాష్‌ తయారీ విధానం, దానివల్ల కలిగే

    ప్రయోజనాలు మండల వ్యవసాయ అధికారి రెబల్‌సన్‌ మాటల్లో...
     మెదక్‌:అధిక దిగుబడుల కోసం రైతులు పంటపొలాల్లో దుక్కిదున్నడం మొదలుకుని పంట నూర్పిళ్లవరకు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతున్నారు. పంటకు తెగుళ్లు సోకితే మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. దీంతో పంట సాగుకు విపరీతమైన ఖర్చువస్తుంది. కొన్ని సందర్భాల్లో పంట దిగుబడిలో వచ్చేకన్నా అధికంగా రసాయన ఎరువులు వాటడం, క్రిమిసంహార మందుల కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో  తీవ్ర నష్టాలను చవిచూడక తప్పడం లేదు.

    భూసారం కూడా తగ్గిపోయి పొలాల్లో ఆశించిన మేర దిగుబడులు రావటంలేదు. ఏ పంట సాగుచేసినా విపరీతమైన తెగుళ్లు సోకడ, దీనంతటికి ముఖ్యకారణం విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగమే. పాతికేళ్ల క్రితం రసాయన ఎరువులు లేవు. అప్పట్లో చెట్ల కొమ్మలు, ఆకులు, మురిగిపోయే గడ్డిజాతులను పొలాలను బురద, బురదగా దున్ని అందులో వీటిని వేసి బాగా మురగబెట్టేవారు.

    అవి మురిగి అసలు పంటకు తెగుళ్లే సోకేవికావు. చెరువుల్లోని నల్లమట్టి,  పశువుల పేడను అధికంగా వేసేవారు. కేవలం పేడకోసమే అప్పట్లో పశువులను ప్రతి ఇంటిముందు పోషిచేవారు. దీంతో సాగు ఖర్చులు రైతులకు ఏ మాత్రం భారం అయ్యేది కాదు. పొలాల్లో సైతం భూసారం గణనీయంగా ఉండేది. ఏ పంటను సాగు చేసినా మంచి దిగుబడులు వచ్చేవి. ఈ మధ్య రసాయన ఎరువుల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో అటు రైతుకు ఖర్చు పెరిగి పోగా, పొలాల్లో భూసారం తగ్గుతుంది. రసాయన ఎరువులకు చెక్‌ పెట్టేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఎరువుతో తయారు చేసిన వర్మీవాష్‌ అనే ద్రవ పదార్థం తయారు చేసి వినియోగించాలి.
    వర్మీవాష్‌ తయారు విధానం..
     20 నుంచి 30 లీటర్లు నీరు నిల్వ ఉండే పెద్ద కుండీని లేదా ప్లాస్టిక్‌ డబ్బాను తీసుకోవాలి. అందులోని అడుగు భాగంలో ఒక ఇంచువరకు గుళికరాళ్లు వేయాలి. దానిపై మరో ఇంచు మేర ఇసుక వేయాలి. దానిపై 40 సెంటీమీటర్ల మేర మట్టిని వేయాలి. దానిపై కుళ్లిపోయే చెత్తాచెదారంతో పాటు ఆకులు, గడ్డి వంటివి వేయాలి.

     దానిపై 5 ఇంచుల మేర ఎండిన పశువుల పేడను వేయాలి. దానిపై 2000 వానసాములు(ఎర్రలు) వేయాలి. వీటన్నింటిని ఆ పాత్రలో వేశాక దాని అడుగు భాగాన ఒక రంధ్రం చేసి దాని కింద ఓ పాత్రను పెట్టాలి. ఆ డబ్బా పైన ఎత్తులో మరో చిన్నపాటి డబ్బాను కట్టి అందులో నీటిని నింపి ఆ డబ్బాకు చిన్నపాటి రంధ్రం కొట్టాలి. ఒక్కో చుక్కనీరు ఆ డబ్బాలో పడేలా చూడాలి. దీంతో ఆ డబ్బాలోని ఎరువు, చెత్తాచెదారం మురిగిపోతుంది, వాటిని వానపాములు తింటుంటాయి.  ఆ డబ్బాకు అడుగు భాగంలో వేసిన చిన్నపాటి రంధ్రం నుంచి నీటి బొట్లు వస్తుంటాయి. వాటిని మరో చిన్నపాటి డబ్బాలో మనం పట్టుకుంటే అదే వర్మీవాష్‌.
    పిచికారీ ఇలా...
    పంటలకు ఎలాంటి తెగుళ్లు సోకినా 20 లీటర్ల నీటిలో లీటరు వర్మీవాష్‌ను కలిపి పిచికారీ చేయాలి. అప్పుడు తెగుళ్లు మటుమాయమవుతాయి. ఇందులో లీటరు ఆవుమూత్రం, లీటరు వర్మీవాష్‌లో 20 లీటర్ల నీటిలో కలిపి స్ప్రేచేస్తే ఎలాంటి తెగుళ్లైన పోతాయి. పంట ఎదుగుదల బాగా ఉంటుంది.
    అజొల మొక్కతో పంటకు మేలు..
    ఒక రకమైన (మొక్క) అజొల పంటలకు విపరీతమైన లాభాలున్నాయి. వరి నాట్లు వేశాక  కొద్దిపాటి అజొల తెచ్చి పొలంలో వేస్తే అది విపరీతంగా పెరుగుతుంది. దీంతో పంటకు నత్రజని బాగా లభిస్తుంది. యూరియా, బాస్పరం వంటి రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువుగా బాగా పంటకు ఉపయోగ పడుతుంది. దీన్ని పశువుల దాణగా, కోళ్లకు సైతం దాణాగా వేయవచ్చు. నీటిలో కొద్దిపాటి అజొల వేస్తే 15 రోజుల్లో అది పొలం అంతటా అవుతుంది.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement