ఇద్దరు యువతుల సహజీవనం | Dating of two young girls | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువతుల సహజీవనం

Published Sat, Nov 7 2015 2:58 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ఇద్దరు యువతుల సహజీవనం - Sakshi

ఇద్దరు యువతుల సహజీవనం

వేములపల్లి: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అన్నమణి, మిర్యాలగూడకు చెందిన శ్రీదేవి ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. శ్రీదేవికి మిర్యాల గూడకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరగగా, మూడేళ్ల క్రితం విడిపోయారు. శ్రీదేవి, అన్నమణిలు ఇప్పటికీ మూడుసార్లు వివాహం చేసుకున్నారు.  శ్రీదేవి శుక్రవారం అన్నమణిని తీసుకెళ్లేందుకు శెట్టిపాలెం రాగా గ్రామస్తులు, అన్నమణి తల్లిదండ్రులు వారించారు. అయినా వినకపోవడంతో స్థానికులు  వేములపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించగా తామిద్దరం కలిసే జీవిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement