బాలిక అనుమానాస్పద మృతి
కొత్తపేట : పదహారేళ్ల బాలిక అనుమానాస్పదlస్థితిలో మరణించినట్టు కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఏఎస్సై ఎ.గరగారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కౌశిక రోడ్డు వంతెన వద్ద బాలిక కిందపడి, కొట్టుకుంటుండగా స్థానిక యువకులు గమనించారు. వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించింది. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో బావ అని ఉన్న నంబరుకు కాల్ చేసి, సమాచారం తెలిపారు. ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెది రావులపాలెం మండలం దేవరపల్లి శివారు మెరకపాలెం. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి చొల్లంగి శ్రీనివాసరావు, తల్లి కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు పిఠాపురం వెళ్లారు. కాగా సమాచారం అందుకున్న ఆమె తండ్రి కొత్తపేటకు చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.