డెంగీ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి
డెంగీ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి
Published Sun, Aug 28 2016 8:52 PM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM
మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు
ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని
ఉదయభాను డిమాండ్
ముచ్చింతాల(పెనుగంచిప్రోలు):
డెంగీ జ్వరాలతో గ్రామంలో మరణించిన ఎస్సీ కాలనీకి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబాలు ఒకొక్కరికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జ్వరాలతో మృతి చెందిన పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు సరైన వైద్యం అందించాలని, ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేసి పేద కుటుంబాలను ఆదుకోవాలని వైద్యాధికారి అనిల్‌కుమార్‌కు సూచించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరితో ఫోన్‌లో మాట్లాడి గ్రామాన్ని సందర్శించాలని, వైద్య శిబిరం పూర్తిగా జ్వరాలు తగ్గేవరకు కొనసాగించాలని కోరారు. అనంతరం గ్రామ నాయకులు మల్లెంపాటి సురేష్‌బాబు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో డెంగీ వ్యాధిని తీసి వేయడం దారుణమని, తక్షణమే జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉన్నా 24 గంటలు దాటినా డీఎంహెచ్‌వో, తహసీల్దార్, తదితర అధికారులు రాకపోవటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చవల రామారావు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంజం కేశవరావు, మండల కన్వీనర్ కంచేటి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటాచలం, గ్రామ అధ్యక్షుడు నూకవరపు శ్రీనివాసరావు, ఎస్సీసెల్ నాయకులు వడ్డీకాసులు, గ్రామ యూత్ నాయకులు మన్నే రమేష్, ఇంజం అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
పవన్‌కళ్యాణ్ ఇప్పుడు నిద్రలేచాడా?
పెద్దమోదుగపల్లి (వత్సవాయి) :
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు దురుద్ధేశపూర్వకంగా ఉన్నాయని సామినేని ఉదయభాను ఆరోపించారు. ఆదివారం మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ రెండేళ్ల తరువాత నిద్రలేచి ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా పోరాటాలు, ధర్నాలు చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని గమనించిన చంద్రబాబు మళ్లీ పవన్‌తో జిమ్మిక్కులకు తయారయ్యారని విమర్శించారు.
Advertisement
Advertisement