భక్తుల సందడి
ఝరాసంగం రూరల్: కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు రాకతో ఆలయ ప్రాంగణం పోటేత్తింది. ఆదివారం సెలవు రోజు శ్రావణ మాసం కావడంతో వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు వేకువ జమునుంచే దర్శననికి బారులుతీరారు. అమృతగుండంలో పుణ్యస్నానాలు చేసి జలలింగానికి పూజలు చేశారు. అనంతరం పార్వతి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించకుని మొక్కలు తీర్చుకున్నారు. శ్రావాణ మాసం పురస్కరించుకు దంపతులు ఆలయ హోమ మండపంలో నిర్వహించిన సామూహిక అభిషేకాల్లో పాల్గొని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పంచాయతుల మందిరం, బసవణ్ణ మందిరం, కాశీబాబా మఠం, బలభీముని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.