భక్తులతో యాదాద్రి కిటకిట
యాదగిరిగుట్ట (నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. ఆదివారం సుమారు 70 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మరోవైపు, ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జాం కావడంతో గంటల తరబడి వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వసతి గదులు లభించక భక్తులు శనివారం రాత్రి ఆరు బయటే విశ్రాంతి తీసుకున్నారు. వర్షం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.