వైద్యులు సమయపాలన పాటించాలి
Published Wed, Aug 17 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ఇంద్రవెల్లి : వైద్యులు సమయ పాలన పాటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉట్నూర్ ఆర్‌డివో ఐలయ్య అన్నారు.బుదవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.రోజు వారి వోపీ రికార్డులను పరిశీలించారు.గ్రామలలోని ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందికి అడిగి తెలుకున్నారు.ఆస్పత్రిలో ఒక్కరే వైద్యురాలు ఉన్నారని, ఇంకోక్కరు వైద్యులు అవసరమని ఆర్‌డివో దష్టికి తీసుకేల్లారు.వెంటనే జిల్లా వైద్యాధికారి జలపతినాయక్‌కు పోన్‌లో సంప్రదించి ఇంద్రవెల్లి ఆస్పత్రిలో వైద్యులను నియమించాలని కోరారు.ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడారు.వైద్యులు విధి నిర్వహనలో సమయపాలన పాటించి,రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.ఈ సందర్బంగా ఎంపీడీవో బానోత్ దత్తారం,ఈజీఎస్ ఏపీవో శ్రీనివాస్,సీహెచ్‌వో రాథోడ్ బాబులాల్,పీహెచ్‌ఎన్ రాములమ్మ,వైద్య సిబ్బంది తదితరులున్నారు.
Advertisement
Advertisement