timelines
-
జింకలు చెప్పే నీతి
నలభై ఐదేళ్ల తన ధర్మప్రచారంలో బుద్ధుడు ఏనాడూ సమయపాలన తప్పలేదు. అయితే, కొందరు భిక్షువులు ధర్మోపదేశాలు వినడానికి రోజూ వచ్చేవారు కాదు. ఒక రోజున అలాంటి ఒక యువ భిక్షుకుడితో, బుద్ధుడు ఈ కథ చెప్పాడు... ‘‘ఓ! భిక్షూ! పూర్వం అరణ్యంలో ఒక జింక ఉండేది. అది ఎన్నో విద్యలు నేర్చింది. అడవిలో ఇతర మృగాల నుండి, వేటగాళ్ల నుండి ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఎలా తప్పించుకోవాలో నేర్చింది. ఆ విద్యల్ని తన జాతివారికంతా నేర్పేది. దాని దగ్గర చతురుడు, చలనుడు అనే రెండు జింకలు చేరాయి. చతురుడు క్రమం తప్పకుండా గురువు చెప్పిన సమయానికి వచ్చేవాడు. చెప్పింది శ్రద్ధగా నేర్చేవాడు. కానీ, చలనుడు సమయానికి వచ్చేవాడు కాదు. దాని వల్ల విద్యలన్నీ నేర్వలేకపోయాడు. ఒక రోజున వేటగాళ్లు పన్నిన వలల్లో ఇద్దరూ చిక్కుకున్నారు. చతురుడు గురువు నేర్పినట్లు గాలిని బంధించి చనిపోయినవాడిలా పడివున్నాడు. కానీ, చలనుడు అలా చేయలేకపోయాడు. వేటగాళ్లు వచ్చి చలనుణ్ణి పట్టి బంధించారు. చతురుణ్ణి చూసి ‘చనిపోయిన జింక’ అనుకొని వలను ఎత్తారు. చలనుడు తప్పించుకొన్నాడు. భిక్షూ! చూశావా! సమయపాలన చేసే విద్యార్థికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. లేనివానికి అరకొర జ్ఞానమే దక్కుతుంది. ఇలాంటి అలసత్వం వల్ల పరిపూర్ణ జ్ఞానివి కాలేవు. నిర్వాణం పొందలేవు’’ అని చెప్పాడు. ఆనాటి నుండి ఆ యువభిక్షువు క్రమం తప్పకుండా శిక్షణ పొందాడు. - బొర్రా గోవర్ధన్ -
వైద్యులు సమయపాలన పాటించాలి
ఇంద్రవెల్లి : వైద్యులు సమయ పాలన పాటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉట్నూర్ ఆర్డివో ఐలయ్య అన్నారు.బుదవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.రోజు వారి వోపీ రికార్డులను పరిశీలించారు.గ్రామలలోని ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందికి అడిగి తెలుకున్నారు.ఆస్పత్రిలో ఒక్కరే వైద్యురాలు ఉన్నారని, ఇంకోక్కరు వైద్యులు అవసరమని ఆర్డివో దష్టికి తీసుకేల్లారు.వెంటనే జిల్లా వైద్యాధికారి జలపతినాయక్‌కు పోన్లో సంప్రదించి ఇంద్రవెల్లి ఆస్పత్రిలో వైద్యులను నియమించాలని కోరారు.ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడారు.వైద్యులు విధి నిర్వహనలో సమయపాలన పాటించి,రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.ఈ సందర్బంగా ఎంపీడీవో బానోత్ దత్తారం,ఈజీఎస్ ఏపీవో శ్రీనివాస్,సీహెచ్‌వో రాథోడ్ బాబులాల్,పీహెచ్ఎన్ రాములమ్మ,వైద్య సిబ్బంది తదితరులున్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంచుతాం
మూతపడిన పాఠశాలలను తెరిపిస్తాం 476 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలు ముందుగానే వచ్చారుు ఈసారి టెన్త్ విద్యార్థులకు మేళాలు నిర్వహిస్తాం టీచర్ల కొరత ఉన్నచోట విద్యా వలంటీర్లు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు పర్యవేక్షించాలి జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ విద్యారణ్యపురి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ‘బడి బాట’ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రతి పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే కనీసం ఐదు శాతం అదనంగా విద్యార్థులను చేర్పిస్తామన్నారు. రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా డీఈఓ రాజీవ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అసలే విద్యార్థులు లేని పాఠశాలలను కూడా తెరిపిస్తాం జిల్లాలో 2049 ప్రాథమిక పాఠశాలలుండగా అం దులో అసలే విద్యార్థులు లేని పాఠశాలలు 86 ఉ న్నాయి. వీటిని కూడా తెరిపిస్తున్నాం. అందులో పనిచేసే ఉపాధ్యాయులు గత విద్యాసంవత్సరం లో వేరే పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద పని చేశారు. ఈ విద్యాసంవత్సరంలో ఆయా ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకరి నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 315 వర కు ఉన్నాయి. ఆ పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు ఈ విద్యా సంవత్సరంలో వి ద్యార్థుల నమోదు పెంచాలి. మిగతా పాఠశాలలన్నింటిలో నూ కనీసం 5శాతం విద్యార్థుల సంఖ్యను పెంచాలనేది లక్ష్యం. దీనిపై డిప్యూటీ సీఎం కూడా ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో బడిబాట కార్యక్రమం ఈనెల 17వరకు కొనసాగనుంది. ప్ర భుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఎక్కువ విద్యార్హతలున్న ఉపాధ్యాలున్నారు. తల్లిదండ్రు లు కూడా తమ పిల్లలను ప్రభు త్వ పాఠశాలలకు పంపించాలి. 476 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం జిల్లాలో ఈ విద్యాసంవత్సరం లో 476 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నాం. ఎక్కువ శాతం పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనే డి మాండ్ ఉంది. తొలుత పెలైట్ ప్రాజెక్టుగా 476 స్కూల్స్‌లో ప్రవేశపెడుతున్నాం. మిగతా పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసే అవకాశముంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరుగుతుందని భావిస్తున్నాం. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి జిల్లాలో 2049 ప్రాథమిక, 360 యూపీఎస్‌లు, 510 ఉన్నత పాఠశాలలున్నాయి, 13,096 టీచర్ పోస్టులు ఉండగా.. అందులో 12,068 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులు విధు లు సక్రమంగా నిర్వర్తించాలి. సమయపాలన పాటించకపోతే ఉపేక్షించేది లేదు. విద్యార్థులకు చదవ డం.. రాయటం కనీస సామర్థ్యాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషిచేయాలి. 708 పాఠశాలల్లో బయోమెట్రిక్ 25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయబోతున్నాం. మారుమాల ప్రాంతాల్లో, తండాల్లో తదితర ఎంపిక చేసిన పాఠశాలల్లో మొత్తంగా 708 పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికారాలు అమర్చనున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగునుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు నమోదు చేసేందుకు బయోమెట్రిక్ వినియోగించబోతున్నాం. ముందుగానే వచ్చిన పాఠ్యపుస్తకాలు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు ఎంఈఓలు తీసుకెళ్లారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయూలని ఆదేశించాం. జిల్లాకు 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని రకాల టైటిల్ పాఠ్యపుస్తకాలు 15లక్షల 22వేల 811 కావాలని ప్రతిపాదించగా.. 15 లక్షల 20వేల 617 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. అందులో ఇప్పటివరకు 14లక్షల 75వేల 752 పాఠ్యపుస్తకాలు ఎంఈ ఓలు తమ మండలాలకు తీసుకెళ్లారు. అన్ని టైటిల్ పాఠ్యపుస్తకాలు వచ్చాయి. విద్యార్థులకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. పాఠశాలల్లో కొత్తగా చేరే పిల్లలకు కూడా ఆధార్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాల్సింటుంది. టెన్త్ విద్యార్థులకు మేళాలు మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షల ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలోనూ ఇంకా ముందుగానే టెన్త్ విద్యార్థుల పై ప్రత్యేక దృష్టిపెట్టబోతున్నాం. ప్రతి మండలంలో కొన్ని హై స్కూళ్లు కలిపి ఆయా విద్యార్థులకు ఒకచోట మండల మేళాగా నిర్వహించి సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్‌లతో ముందుస్తుగా టెన్త్‌లో ప్రణాళికాబద్దంగా చదువుకోవడంపై సూచనలు చెప్పించే యోచన ఉంది. జులైలో గానీ అగస్టులో గానీ నిర్వహిస్తాం. ఈసారి టెన్త్ విద్యార్థు లు ఇంకా ఎక్కువగా 10/10 గ్రేడ్లు సాధించేలా వారికి విద్యాబోధన చేయిస్తాం. టీచర్ల కొరత ఉన్నచోట విద్యావలంటీర్లు ఏ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉందో అక్కడ విద్యావలంటీర్లను నియమించబోతున్నాం. ఈమేరకు జిల్లాలో 612 మంది విద్యావలంటీర్లు నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. అనుమతి రాగానే నియమిస్తాం. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే వలంటీర్లను నియమిస్తాం. ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు గత విద్యా సంవత్సరంలో జిల్లాలో వివిధచోట్ల ఎక్కడైతే డిప్యూటేషన్‌పై పనిచేశారో ఆయా డిప్యూటేషన్లు గాని వర్క్ అడ్జస్ట్మెంట్లు గానీ రద్దయ్యాయి. ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల్లోనే సోమవారం నుంచి విధులను నిర్వర్తించాలి. పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచుతాం.. పాఠశాలపై పర్యవేక్షణ పెంచుతాం. జిల్లాలో రెండు మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా మండలాల్లో ఫుల్ అడిషనల్చార్జి(ఎఫ్‌ఏసీతో) ఎంఈఓలు పనిచేస్తున్నారు. ప్రతి ఎంఈఓ కూడా ప్రతీరోజు తమ మండల పరిధిలో రెండు మూడు పాఠశాలలను తనిఖీ చేయాలి. ప్రార్థన సమయానికే ఏదో ఒక పాఠశాలలో ఉంటే ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. హైస్కూళ్లను డిప్యూటీ డీఈఓలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆదేశించాలు ఇచ్చాం. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు కూడా తరచూ తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయవచ్చు. నేను కూడా రోజుకు కనీసం ఒక పాఠశాలనైనా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నా. -
వేళ తప్పితే వేటే!
సమయపాలన పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కన్నెర్ర 20 మందికి తాఖీదులు.. ఇద్దరు డీటీలకు కూడా ప్రజాదర్బార్‌కు రాని అధికారులకు క్లాస్ పాలనలో కలెక్టర్ రఘునందన్ కొత్త ఒరవడి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమయపాలన పాటించని ఉద్యోగులపై కొత్త బాస్ కొరడా ఝళిపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన 20 మందికి తాఖీదులు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన‘ప్రజాదర్బార్’కు డుమ్మా కొట్టిన ఉన్నతాధికారులను వదలకూడదని నిర్ణయించిన కలెక్టర్ రఘునందన్‌రావు.. విధులకు ఆలస్యంగా వచ్చిన, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు ఇవ్వాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్‌డేకు విధిగా జిల్లా అధికారులు హాజరుకావాలని, మండల స్థాయిలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలోనే గత 21న కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగుల హాజరును స్వయంగా తెలుసుకున్న సంగతి తెలిసిందే. సంజాయిషీ ఇవ్వాల్సిందే.. కార్యాలయానికి సకాలంలో హాజరుకాని ఉద్యోగుల నుంచి సంజాయిషీ కోరాలని ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత సోమవారం విధులకు ఆలస్యంగా వచ్చిన 12 మందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ఒక యూడీఆర్‌ఐ ఉన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 8 మందికి కూడా శ్రీముఖాలను జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నిర్ణీత సమయానికి విధులకు రాని ముగ్గురితోపాటు అనధికారికంగా విధులకు ఎగనామం పెట్టిన మరో ఐదుగురికి ఈ నోటీసులు అందాయి. దర్బార్‌కు రానివారి సంగతి తేల్చండి.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాదర్బార్‌కు జిల్లా అధికారులు ముఖం చాటేస్తున్నారు. ఆర్నెల్లుగా అర్జీలను స్వీకరించేందుకు కలెక్టర్, జేసీలు సైతం హాజరుకాకపోవడంతో దర్బార్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. యథారాజా తథా అధికారి అన్న తరహాలో జిల్లా బాస్‌లు రాకపోవడంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రతి సోమవారం ప్రజాదర్బార్ మొక్కుబడిగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించినకలెక్టర్ రఘునందన్‌రావు.. పాత రికార్డుల దుమ్ముదులపాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్‌కు సంబంధించి కొన్ని నెల ల హాజరు వివరాలను నివేదిం చాలని డీఆర్ఓను ఆదేశిం చారు. ఈ సమాచారాన్ని బేరీజు వేయ డం ద్వారా గ్రీవెన్స్‌డేకు రాని అధికారులకు తలంట నున్నట్లు తెలిసింది. కలెక్టరేట్ తరహా లోనే క్షేత్రస్థాయిలోనూ ఇదే విధానం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచా రం. చెత్తకుప్పలను తలపించేలా వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు.. మెకానిక్ షెడ్డును పోలినట్లు చెడిపోయిన కార్ల పార్కింగ్తో కనిపించిన కలెక్టరేట్ ఆవరణను కొత్త యంత్రాంగం ‘క్లీన్’గా చేసిం ది. కేవలం ఆవరణలేకాకుండా.. పనితీరులోనూ మార్పు తెచ్చేలా నయా బాస్ రఘునందన్ సంస్కరణలు తీసుకురావడం విశేషం. -
సమయ పాలన లేకుంటే క్రమశిక్షణ చర్యలు
గుంటూరు మెడికల్ విధి నిర్వహణలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి హెచ్చరించారు. క్లస్టర్ అధికారులు, వైద్యాధికారులతో గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌సీల సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల మందులను నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాలకు 104 వాహనం వెళ్లినపుడు సమీప ఆరోగ్యకేంద్రంలోని డాక్టర్ తప్పనిసరిగా వె ళ్లి వైద్యసేవలు అందించాలని స్పష్టం చేశారు. గర్భిణుల ఆధార్ నంబర్లను ఆన్లైన్లో అనుసంధానం చేయాలని, కాన్పులన్నీ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల వివరాలను ఆరోగ్యకేంద్రాల నోటీస్‌బోర్డుపై ఉంచాలన్నారు. గర్భిణులకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇవ్వటంతోపాటు హెచ్ఐవీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రోగులకు సమాచారం అందించేందుకు రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ జిల్లా అధికారి డాక్టర్ మేడ శ్యామలాదేవి మాట్లాడుతూ ఆస్పత్రి కాన్పులకు అందజేసే జేఎస్వై పారితోషికాలను అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్లోనే చెల్లిస్తారని చెప్పారు. జేఎస్వై, జేఎస్ఎస్కే ఆరోగ్య కార్యక్రమాల నోడల్ అధికారులుగా సీహెచ్‌ఓలు వ్యవహరిస్తారని చెప్పారు. గర్భిణుల ఆధార్ నంబర్ల అనుసంధానాన్ని జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్లు ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధార్ అనుసంధానాన్ని సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్బాబునాయక్ మాట్లాడుతూ పోలియో వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకపై చుక్కల మందు స్థానంలో వ్యాక్సిన్ రానుందని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి వరదా రవీంద్రబాబు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, ఏపీ వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జి.శ్రీదేవి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ గాంధీజయంతి నాగలక్ష్మి, జవహర్ బాల ఆరోగ్యరక్ష జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భూక్యా లకా్ష్మనాయక్, డాక్టర్ వై.రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేళకు రారు.. వేచి చూడరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలన గాడితప్పుతోంది. మెజారిటీ పాఠశాలల్లో బడిగంట మోగినప్పటికీ ఉపాధ్యాయుల జాడ మచ్చుకు కూడా కనిపించడం లేదు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15వరకు 921 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఉన్నత పాఠశాలలతో పోలిస్తే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని తేలింది. సమయపాలనే అసలు సమస్య.. సర్కారు బడుల్లో ప్రధానంగా సమయపాలనే పెద్ద సమస్యగా మారింది. విద్యాశాఖ కఠినంగా వ్యవహరించక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే వాదన వినిపిస్తోంది. గతనెల బాలల దినోత్సవం నాడు ఆర్వీఎం పీఓ ఉప్పల్ మండలంలోని ఓ పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో తొమ్మిది మంది టీచర్లుండగా బడివేళకు ఒక్క టీచరు కూడా హాజరుకాలేదు. దీంతో తనిఖీ రిపోర్టును జిల్లా విద్యాశాఖకు సమర్పించినప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖల్లాలేవు. మరోవైపు ఉప విద్యాధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం లేదు. కేవలం రెండు నెలల కాలంలో రెండు పాఠశాలలు మాత్రమే తనిఖీ చేయడం గమనార్హం. తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలివీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్ నెలాఖర్లో నిర్వహణ నిధులు విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నిబంధల మేరకు రూ.1.5కోట్లు విడుదల చేశారు. అయితే తనిఖీ చేసిన 921 పాఠశాలల్లో నిర్వహణ నిధులు వినియోగించినప్పటికీ.. మెజారీటీ వాటిలో టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. బోధకులు లేని కారణంతో 95 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలన పడ్డాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అడపాదడపా కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఫర్నిచర్ కొరత ఉంది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు బోధన ప్రణాళిక ప్రకారం సాగుతోంది. అయితే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం విద్యార్థులకు సరైన రీతిలో బోధన జరగడం లేదు. {పోగ్రెస్ కార్డుల పంపిణీ సగం పాఠశాలల్లో పెండింగ్‌లో ఉంది.