విద్యార్థుల సంఖ్య పెంచుతాం | The number of students pencutam | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంచుతాం

Published Sun, Jun 12 2016 1:18 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

The number of students pencutam

మూతపడిన పాఠశాలలను తెరిపిస్తాం
476 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
పాఠ్యపుస్తకాలు ముందుగానే వచ్చారుు
ఈసారి టెన్త్ విద్యార్థులకు మేళాలు నిర్వహిస్తాం
టీచర్ల కొరత ఉన్నచోట విద్యా వలంటీర్లు
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు పర్యవేక్షించాలి
జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్

 

విద్యారణ్యపురి   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ‘బడి బాట’ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రతి పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే కనీసం ఐదు శాతం అదనంగా  విద్యార్థులను చేర్పిస్తామన్నారు. రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా డీఈఓ రాజీవ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

 
అసలే విద్యార్థులు లేని  పాఠశాలలను కూడా తెరిపిస్తాం

జిల్లాలో 2049 ప్రాథమిక పాఠశాలలుండగా అం దులో అసలే విద్యార్థులు లేని పాఠశాలలు 86 ఉ న్నాయి. వీటిని కూడా తెరిపిస్తున్నాం. అందులో పనిచేసే ఉపాధ్యాయులు గత విద్యాసంవత్సరం లో వేరే పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద పని చేశారు. ఈ విద్యాసంవత్సరంలో ఆయా ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల్లో  విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకరి నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 315 వర కు ఉన్నాయి. ఆ పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు ఈ విద్యా సంవత్సరంలో వి ద్యార్థుల నమోదు పెంచాలి. మిగతా పాఠశాలలన్నింటిలో నూ కనీసం 5శాతం విద్యార్థుల సంఖ్యను పెంచాలనేది లక్ష్యం. దీనిపై డిప్యూటీ సీఎం కూడా ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో బడిబాట కార్యక్రమం ఈనెల 17వరకు కొనసాగనుంది. ప్ర భుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఎక్కువ విద్యార్హతలున్న ఉపాధ్యాలున్నారు. తల్లిదండ్రు లు కూడా తమ పిల్లలను ప్రభు త్వ పాఠశాలలకు పంపించాలి.

 
476 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం

జిల్లాలో ఈ విద్యాసంవత్సరం లో 476 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నాం. ఎక్కువ శాతం పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనే డి మాండ్ ఉంది. తొలుత పెలైట్ ప్రాజెక్టుగా 476 స్కూల్స్‌లో ప్రవేశపెడుతున్నాం. మిగతా పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసే అవకాశముంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరుగుతుందని భావిస్తున్నాం.

 
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
జిల్లాలో 2049 ప్రాథమిక, 360 యూపీఎస్‌లు, 510 ఉన్నత పాఠశాలలున్నాయి, 13,096 టీచర్ పోస్టులు ఉండగా.. అందులో 12,068 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులు విధు లు సక్రమంగా నిర్వర్తించాలి. సమయపాలన పాటించకపోతే ఉపేక్షించేది లేదు. విద్యార్థులకు చదవ డం.. రాయటం కనీస సామర్థ్యాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషిచేయాలి.

 
708 పాఠశాలల్లో బయోమెట్రిక్

25శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయబోతున్నాం. మారుమాల ప్రాంతాల్లో, తండాల్లో తదితర ఎంపిక చేసిన పాఠశాలల్లో మొత్తంగా 708 పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికారాలు అమర్చనున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగునుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు నమోదు చేసేందుకు బయోమెట్రిక్ వినియోగించబోతున్నాం.

 
ముందుగానే వచ్చిన పాఠ్యపుస్తకాలు

ఉచిత పాఠ్యపుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు ఎంఈఓలు తీసుకెళ్లారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయూలని ఆదేశించాం. జిల్లాకు 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని రకాల టైటిల్ పాఠ్యపుస్తకాలు 15లక్షల 22వేల 811 కావాలని ప్రతిపాదించగా.. 15 లక్షల 20వేల 617 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. అందులో ఇప్పటివరకు 14లక్షల 75వేల 752 పాఠ్యపుస్తకాలు ఎంఈ ఓలు తమ మండలాలకు తీసుకెళ్లారు. అన్ని టైటిల్ పాఠ్యపుస్తకాలు వచ్చాయి. విద్యార్థులకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. పాఠశాలల్లో కొత్తగా చేరే పిల్లలకు కూడా ఆధార్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాల్సింటుంది.

 
టెన్త్ విద్యార్థులకు మేళాలు

మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షల ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలోనూ ఇంకా ముందుగానే టెన్త్ విద్యార్థుల పై ప్రత్యేక దృష్టిపెట్టబోతున్నాం. ప్రతి మండలంలో కొన్ని హై స్కూళ్లు కలిపి ఆయా విద్యార్థులకు ఒకచోట మండల మేళాగా నిర్వహించి సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్‌లతో ముందుస్తుగా టెన్త్‌లో ప్రణాళికాబద్దంగా చదువుకోవడంపై సూచనలు చెప్పించే యోచన ఉంది. జులైలో గానీ అగస్టులో గానీ నిర్వహిస్తాం. ఈసారి టెన్త్ విద్యార్థు లు ఇంకా ఎక్కువగా 10/10 గ్రేడ్‌లు సాధించేలా వారికి విద్యాబోధన చేయిస్తాం.

 
టీచర్ల కొరత ఉన్నచోట విద్యావలంటీర్లు

ఏ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉందో అక్కడ విద్యావలంటీర్లను నియమించబోతున్నాం. ఈమేరకు జిల్లాలో 612 మంది విద్యావలంటీర్లు నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. అనుమతి రాగానే నియమిస్తాం. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే వలంటీర్లను నియమిస్తాం.

 

 

ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు
గత విద్యా సంవత్సరంలో జిల్లాలో వివిధచోట్ల ఎక్కడైతే డిప్యూటేషన్‌పై పనిచేశారో ఆయా డిప్యూటేషన్‌లు గాని వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లు గానీ రద్దయ్యాయి. ఉపాధ్యాయులు తమతమ పాఠశాలల్లోనే సోమవారం నుంచి విధులను నిర్వర్తించాలి.

 

పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచుతాం..
పాఠశాలపై పర్యవేక్షణ పెంచుతాం. జిల్లాలో రెండు మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా మండలాల్లో ఫుల్ అడిషనల్‌చార్జి(ఎఫ్‌ఏసీతో) ఎంఈఓలు పనిచేస్తున్నారు. ప్రతి ఎంఈఓ కూడా ప్రతీరోజు తమ మండల పరిధిలో రెండు మూడు పాఠశాలలను తనిఖీ చేయాలి. ప్రార్థన సమయానికే ఏదో ఒక పాఠశాలలో ఉంటే ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. హైస్కూళ్లను డిప్యూటీ డీఈఓలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆదేశించాలు ఇచ్చాం. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు కూడా తరచూ తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయవచ్చు. నేను కూడా రోజుకు కనీసం ఒక పాఠశాలనైనా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నా. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement