సర్వజనాస్పత్రిలో బాలింతపై నిర్లక్ష్యం | doctors negligance in government hospital | Sakshi
Sakshi News home page

సర్వజనాస్పత్రిలో బాలింతపై నిర్లక్ష్యం

Published Sat, Nov 5 2016 10:12 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

సర్వజనాస్పత్రిలో బాలింతపై నిర్లక్ష్యం - Sakshi

సర్వజనాస్పత్రిలో బాలింతపై నిర్లక్ష్యం

అనంతపురం మెడికల్‌ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. ప్రసవం తర్వాత ఇంకా అనారోగ్యంగానే ఉన్న ఓ బాలింతను డిశ్చార్జ్‌ చేశారు. చివరకు తప్పు తెలుసుకుని మళ్లీ అడ్మిషన్‌ చేయించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు మండలం కసాపురానికి చెందిన మహేశ్వరి ఈ నెల 1వ తేదీన గుంతకల్లు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పల్స్‌రేట్, బీపీ తగ్గిపోవడంతో అదే రోజు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు.

మూడ్రోజులు వైద్యం అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం కుదుటపడకముందే శనివారం డిశ్చార్జ్‌ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మహేశ్వరి అనారోగ్యంతో కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ సంధ్య అక్కడికి చేరుకుని తిరిగి అడ్మిషన్‌ చేసుకున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement