పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
Published Tue, Aug 23 2016 12:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
నెల్లికుదురు : భర్త వేధించాడని మనోవేదనకు గురైన ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రత్తిరాంతండాలో సోమవారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పత్తిపాక చందర్ కథనం ప్రకారం.. రత్తిరాతండాకు చెందిన గుగులోతు మోతిరాంతో గుగులోతు చిలుకమ్మ(42)కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో మోతిరాం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి చిలుకమ్మను భర్తతోపాటు రెండో భార్య వేధించసాగారు. దీంతో మనోవేదనకు గురైన చిలుకమ్మ ఈ నెల 8న పురుగుల మందు తాగడంతో తండావాసులు ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ చిలుకమ్మ మృతిచెందింది. మృతురాలి కూతురు సుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేసినట్లు చందర్ చెప్పారు.
Advertisement
Advertisement