చుక్కపడితే కటకటాలే!
♦ ‘డ్రంకెన్ డ్రైవ్’తో మందుబాబుల వెన్నులో వణుకు
♦ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 97మందికి శిక్ష
♦ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కృషి
♦ ఏడాదిలో కేసులు 6460, పెండింగ్ 900
గద్వాల క్రైం : మద్యం తాగి వాహనాలను నడిపే మందుబాబులు చుక్కలు చూడా ల్సిందే. తరచూ రోడ్డు చోటుచేసుకోవడంతో పోలీసులు ఆకతాయిల దూకుడు కు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందుకోసమే ఉద్దేశించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తుండడం తో మందుబాబుల వెన్నులో వణుకు మొదలైంది. బ్రీత్ ఎనలైజర్‌లో నమోదైన ప్రకారం ఆల్కహాల్ శాతం 100లోపు ఉంటే రూ.1500, 100శాతం దాటితే రూ.2500 జరిమానాతో పాటు శిక్షపడే అ వకాశం ఉంది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2016 అక్టోబర్ 2017ఆగస్టు వరకు 6460మంది పోలీసులకు పట్టుబ డి జరిమానాలు చెల్లించారు. వీరిలో 97మంది ఫైన్ కట్టడంతో పాటు జైలుశిక్షను సైతం అనుభవించారు.
మొదటిస్థానంలో నాగర్‌కర్నూల్ జిల్లా
జిల్లాల వారీగా చూస్తే డ్రంకెన్‌డ్రైవ్ కే సుల్లో నాగర్‌కర్నూల్ మొదటిస్థానంలో ఉంది. మొత్తం 2230కేసులు నమోదుకా గా, రూ.42.60లక్షలు జరిమానా విధిం చారు. రెండవ స్థానంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండగా, 1670కేసులు న మోదయ్యాయి. వీరినుంచి రూ.33.40లక్షలు, మూడవ స్థానంలో వనపర్తి జిల్లా లో 1492కేసులు నమోదుకాగా రూ. 29.84లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1068 కేసులు నమోదు కాగా, వీరికి నుంచి రూ.18.97లక్షలు జరిమానా విధించారు. ఇదిలాఉండగా, ఇప్పటివర కు జోగుళాంబ గద్వాల జిల్లాలో 700 కేసులు, వనపర్తి జిల్లాలో 100కేసులు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 100కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
యువతపైనే ఎక్కువ కేసులు
మద్యం తాగి వాహనం నడపడం కొంతమంది యువకులకు ఓ ఫ్యాషన్‌గా మారింది. అందులోనూ కళాశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. తల్లిదండ్రులు వారికి అడిగినంత జేబు ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జల్సాలకు అలవాటుపడి మద్యం మత్తులో హద్దుమీరుతున్నారని పలు సందర్భాల్లో స్పష్టమైంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై త రచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. నిత్యం పదుల సంఖ్యలో అమాయకులు మృత్యువాతపడుతున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో పోలీస్‌శాఖ డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టిసారింది. గ్రామీణ, పట్టణ, రాష్ట్ర, జాతీయ రహదారులపై విస్తృతం గా తనిఖీలు చేపడుతోంది.
వాహనదారుల్లో మార్పునకు కృషి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఎక్కువగా ప్రధాన రహదారులపైనే మద్యం మత్తులో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ చేపడుతుండడంతో ప్రమాదాలు జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే పూర్తిస్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చు.– రోహిణి ప్రియదర్శిణి, వనపర్తి జిల్లా ఎస్పీ
శిక్ష అనుభవించిన వారు..
♦ డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో జైలుశిక్ష అనుభవించిన వారిలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సుడ్రైవర్ బుచ్చయ్య యాదవ్‌కు కోర్టు 15రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. అత్యధికంగా 77 మంది జైలుశిక్షను అనుభవించిన వారిలో నాగర్‌కర్నూల్ జిల్లావాసులే ఉన్నారు.
♦ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏప్రిల్‌లో ఓ యువకుడు మద్యం తాగి పట్టుబడితే పట్టణంలో రెండు రోజులు ట్రాఫిక్ విధులు నిర్వహించేలా కోర్టు తీర్పు వెలువరించింది.