నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు పట్టుబడ్డారు.
హైదరాబాద్ సిటీ: నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 16 మందిపై కేసులు నమోదు చేశారు. 11 కార్లతో పాటు ఐదు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.