తూతూమంత్రంగా ఈసీ మీటింగ్
Published Sat, Apr 22 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
కర్నూలు(ఆర్‌యూ) : రాయలసీమ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం తూతూమంత్రంగా ముగించేశారు. వర్సిటీ సమస్యలు, పరిష్కారంపై చర్చ కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, రాష్ట్ర కాలేజ్ మేట్ కమిషనర్ కాని హాజరుకాలేదు.రాష్ట్ర ఫైనాన్స్ జాయింట్ సెక్రటరి సి.హెచ్.వి.ఎన్.మల్లేశ్వరరావు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ వై.నరసింహులు మాట్లాడుతూ వర్సిటీలో విద్యుత్ వాడకం ఎక్కువైనందునా లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి రూ. 1.2 కోట్లతో 11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం, 500 కేవీ పరిమాణంలో రూఫ్‌టాప్ పవర్‌లో భాగంగా వర్సిటీలోనే సోలార్ పవర్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయించామన్నారు. పీపీపీ భాగస్వామ్యంలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న లైఫ్ సైన్స్ బిల్డింగ్‌లో అవసరమయ్యే ల్యాబ్ పరికరాలు, కంప్యూటర్లు, స్టోరేజ్ పాయింట్, ఫర్నీచర్ తదితరవాటికి రూ.2 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించామన్నారు. కార్యక్రమంలో ఈసీ మెంబర్లు రిజిస్ట్రార్ అమర్‌నాథ్, డాక్టర్ అబ్దుల్ ఖాదర్, డాక్టర్ శివశంకర్, డాక్టర్ జి.టి.నాయుడు, ప్రొఫెసర్ సంజీవరావు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావును ఈసీ మెంబర్‌గా ప్రభుత్వానికి నివేదించకపోవడంపై ఈ సమావేశానికి కూడా దూరం పెట్టారు.
Advertisement