ఏకత్వానికి నిదర్శనం ఏక్తాయాత్ర | Ekta Yatra commences in Nellore | Sakshi
Sakshi News home page

ఏకత్వానికి నిదర్శనం ఏక్తాయాత్ర

Published Wed, Sep 7 2016 1:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఏకత్వానికి నిదర్శనం ఏక్తాయాత్ర - Sakshi

ఏకత్వానికి నిదర్శనం ఏక్తాయాత్ర

 
  • కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి
 
నెల్లూరు(బృందావనం): సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సాగే గణేష్‌ సందర్శన ఏకతా యాత్ర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. వినాయక చవితి సందర్భంగగా మూడు రోజులు నెల్లూరు నగరంలో విశేషంగా నిర్వహించే ‘గణేష్‌ సందర్శన ఏకతా యాత్ర’ ప్రారంభం సందర్భంగా స్థానిక పురమందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథథిగా హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతితో ముడిపడిన పండగల్లో ఎంతో పరమార్థం ఉందన్నారు. ప్రధానంగా వినాయకచవితి సందర్భంగా నిర్వహించుకునే కార్యక్రమాల్లో సామాజిక ప్రగతికి, సంఘటిత జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఎన్నో ముడివడి ఉన్నాయని అన్నారు. 
అంతరాలు లేని ఆత్మీయ సమాజం కోసమే : కమలానంద భారతిస్వామి
అంతరాలు లేని ఆత్మీయ సమాజాన్ని నిర్మించుకునేందుకే గణేష్‌ సందర్శన ఏకతా యాత్రను చేపడుతున్నట్లు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. జాతీయ భావం కలిగించేందుకు, దేశభక్తి పెంపొందించేందుకు, స్వధర్మం పట్ల ప్రేమానురాగాలు పెంచేందుకు బాలగంగాధర్‌ తిలక్‌ శ్రీకారం చుట్టారన్నారు. సమాజ హితం కోరిన రామానుజాచార్యులు, దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్, దార్శనికుడు, భారత మాజీ రాష్ట్రపతి, గురువుకు ప్రతిరూపంగా నిలిచిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మహనీయుల పుట్టిన రోజున యాదృచ్ఛికంగా వినాయక చవితి పర్వదినం కావడం, అదే రోజు సింహపురిలో గణేష్‌ సందర్శన ఏక్తా యాత్రను ఎంతో విశేషమని కమలానందభారతి స్వామీజీ అన్నారు.
 
సమాజ సంఘటితం కోసమే : కన్వీనర్‌ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి
నెల్లూరులో అన్ని వర్గాలను ఏకం చేస్తూ సమాజ సంఘటితం కోసం గత మూడేళ్ల నుంచి సింహపురి గణేష్‌ సందర్శన ఏకతా యాత్ర నిర్వహిస్తున్నట్లు యాత్ర కన్వీనర్‌ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి తెలిపారు. 
కోలాహలంగా సాగిన ఏక్తాయాత్ర
భాజాభజంత్రీలు, తప్పెట్లు, కోలాటాలు, కీలుగుర్రాల నృత్యాలు, పండరిభజనలు, కర్రసాము విన్యాసాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో సోమవారం సింహపురి గణేష్‌ సందర్శన ఏకతా యాత్ర సాగింది. ఏకతా యాత్రను కేంద్రమాజీ మంత్రి పురంధరేశ్వరి, కమలానంద భారతిస్వామీజీ పురమందిరం ఎదుట ఉన్న శ్రీజ్యోతి వినాయక మందిరంలో గణపతికి పూజలు నిర్వహించిప్రారంభించారు. 
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఏకతా యాత్ర సందర్భంగా పురమందిరంలో విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ కార్యక్రమాలను ప్రదర్శించిన కళాకారులను పురంధరేశ్వరి, కమలానంద భారతిస్వామీజీ సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement