- ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్ కమాండెంట్ శర్మ
- బీచ్‌లో పరిశుభ్రతా కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణతో ఆర్థికాభివృద్ధి
Published Sat, Feb 4 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
కాకినాడ రూరల్ :
పర్యావరణ పరిరక్షణతో సామాజిక, ఆర్థికాభివృద్ధి ముడిపడి ఉందని ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్స్ కాకినాడ విభాగం కమాండెంట్ ఆర్.కె.శర్మ తెలిపారు. ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్స్ 40వ వార్షికోత్సవాల్లో భాగంగా సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌లో శనివారం ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి వంటి ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్నారు. కాకినాడ తీరంలో సముద్ర జలాలతో పాటు, బీచ్‌లో పర్యావరణ రక్షణకు ఏటా కోస్ట్‌గార్డ్ వార్షికోత్సవాల సందర్భంగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి సహకరిస్తున్న విద్యాసంస్థలు, మెరై¯ŒS పోలీస్, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గ్రామ పంచాయతీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్ట్‌గార్డ్స్ అసిస్టెంట్ కమాండెంట్ సి.వి.ఎ¯ŒS.మూర్తి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎ¯ŒSఎస్‌ఎస్ బోర్డు మెంబరు ఎం.సత్యనారాయణ, ఆదిత్య కళాశాల ఎ¯ŒSఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం సుబ్రహ్మణ్యం, ధరిత్రీ రక్షిత సమితి అధ్యక్షురాలు ఎస్.సురేఖ, మెరై¯ŒS పోలీస్ సీఐ రాజారావు, ఎస్‌ఐ లక్ష్మణస్వామి, సూర్యారావుపేట సర్పంచ్ యజ్జల బాబ్జీ, వాలకపూడి కార్యదర్శి బి.రత్నం, ఆదిత్య కళాశాల విద్యార్థులు, పలు స్వచంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement