kakinada beach
-
తీరానికి అందాల హారం! బీచ్‌లలో ఆధునిక సదుపాయాలు.. పోటీలు షురూ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఆప్టా) చర్యలు చేపడుతోంది. బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌కు అనుగుణంగా పర్యావరణ హితంగా, అందంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో ఆధునిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రాజెక్టు డిజైన్ల కోసం ఆర్కిటెక్ట్ పోటీలను నిర్వహిస్తోంది. ఆర్కిటెక్ట్ సంస్థలతోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ (సీవోఏ)లో రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ)లో రిజిస్టర్డ్ ప్లానర్లు, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల (వ్యక్తిగత/బృందాలుగా)నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి ఉత్తమ ఆర్ఎఫ్పీలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించనుంది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాలను https://tourism.ap.gov.in/tenders వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభివృద్ధి ప్రణాళిక ఇలా... తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో సుమారు 1,500 మీటర్లు చొప్పున అభివృద్ధి చేయనున్నారు. ఈ బీచ్‌లను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతోపాటు స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వ్యూ పాయింట్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, టూరిస్ట్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ రిసెప్షన్ సెంటర్, రెస్క్యూ, వైద్య సౌకర్యాలు, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. మరోవైపు పశ్చిమగోదారి జిల్లా పేరుపాలెంలో 104 ఎకరాల్లో, పల్నాడు జిల్లా నాగులవరంలో 250 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో బీచ్ కాటేజీలు, హోటళ్లు, రిసార్ట్స్, సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్లు, థీమ్ పార్క్, వ్యూ పాయింట్లు, టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వంటివి ఆధునిక సౌకర్యాలో ఏర్పాటు చేయనున్నారు. నగదు బహుమతులు ఇలా.. ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి వచ్చిన మొదటి మూడు ఉత్తమ ఎంపికలకు రూ.1,50,000, రూ.1,00,000, రూ.75,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. సీవోఏ రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఐటీపీఐ రిజిస్టర్డ్ ప్లానర్ నుంచి వచ్చిన ఉత్తమ డిజైన్లకు రూ.1,00,000, రూ.75,000, రూ.55,000 చొప్పున, విద్యార్థి విభాగంలో విజేతలకు రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రతిభగల ఆర్కిటెక్ట్‌లకు ఆప్టాతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
పర్సు మర్చిపోయిన మోహన్.. శనక్కాయల సత్తియ్య... ఎక్కడున్నావ్...!
ఆ చిన్న పిల్లల పట్ల ఆ పేదోడు చూపించిన ‘పెద్ద మనస్సు’ 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది. చేసేది చిరువ్యాపారమైనా చిన్నారులను చూసి ఆత్మీయతకనబరిచిన అతని తీరుకు ముగ్థుడైన ఓ ఎన్ఆర్ఐ దశాబ్ధాం తరువాత సదరు చిరువ్యాపారి కుటుంబాన్ని వెతికిపట్టుకుని రూ.25వేలు బహుమానంగా ఇచ్చి తన విజ్ఞతను, ఔదార్యాన్ని చాటుకున్నారు. సాక్షి, కాకినాడ: గింజాల పెదసత్తియ్య కాకినాడ బీచ్‌లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అమెరికాలో స్థిరపడ్డ మోహన్ నేమాని తన పిల్లలతో 2010లో కాకినాడ బీచ్‌కు వెళ్ళారు. అక్కడ పిల్లలు అడగడంతో శనక్కాయలు కొనిచ్చారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి పర్సు మర్చిపోయిన విషయాన్ని మోహన్ గుర్తించారు. విషయాన్ని గమనించిన పెదసత్తియ్య... పర్వాలేదు సార్, పిల్లలే కదా మరోసారి వచ్చినప్పుడు ఇద్దరుగాని లెండి అంటూ పంపించేశాడు. ఆ తరువాత మోహన్‌కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. అయితే మోహన్‌కుమారుడు ప్రణవ్ బీచ్‌రోడ్డులో ‘శనక్కాయల’ జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తుచేస్తూ సదరు చిరువ్యాపారి సత్తియ్యతో దిగిన ఫొటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నారు. పెదసత్తియ్య కుటుంబానికి సహాయం అందిస్తున్న ప్రణవ్, అతని సోదరి సుచిత 12 ఏళ్ళ తరువాత... సదరు చిరువ్యాపారికి ఎంతోకొంత సొమ్ము ఇవ్వాలనుకున్నా అతడు ఎక్కడున్నాడో మోహన్ నేమానికి ఆచూకీ చిక్కలేదు. దీంతో తనకు బాగాప రిచయుస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకురాగా, అతని కుటుంబం నాగులాపల్లిలో ఉంటుందని, రెండేళ్ళ క్రితమే సత్తియ్య చనిపోయాడని తెలుసుకున్నారు. సోంతూరుకు వచ్చిన మోహన్‌నేమాని కుటుంబం గురువారం అతని భార్య గంగ, ఇద్దరు పిల్లలను పిలిపించి నాటి విషయాన్ని జ్జాప్తికి తెచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం వద్ద పెదసత్తియ్య కుటుంబం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో ఆయన నివాసం వద్ద రూ.25వేలు బహుమానంగా ఇచ్చారు. మోహన్కుటుంబాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అభినందించారు. మోహన్ నేమాని మాట్లాడుతూ తరచూ తన కుమారుడు ప్రణవ్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కాకినాడ వెళ్ళినప్పుడు అతనికి కొంత సొమ్ము ఇద్దామని చెప్పేవాడని, ఈ క్రమంలోనే సొమ్ము అందజేశామని తెలిపారు. -
ఈ అందాలు డబ్బున్న వారికే..
పై ఫొటోల్లో అందాలను చూశారా...కాకినాడ బీచ్‌లో కోట్ల రూపాయల వ్యయంతో వీటిని ప్రభుత్వం నిర్మిస్తుంటే పరిసర ప్రాంత ప్రజలు మురిసిపోయారు. అన్నీ పూర్తయిన తరువాత వెళ్లిన జనానికి నిరాశే మిగిలింది. లోపలికి వెళ్లడానికి టిక్కెట్...తీరా వెళ్లాక ప్రతి మలుపులోనూ టిక్కెట్ల మోతే. తెగించి వెళ్తే ఓ కుటుంబానికి కనీసం రూ.200 పైనే జేబుకు చిల్లుపడుతుంది. దీంతో వెళ్లినవారు తిరుగుముఖం పట్టక తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కాకినాడ బీచ్ అందాలు ఉచితంగా చూసే యోగ్యత లేదు. డబ్బులిచ్చి బీచ్‌లో అడుగు పెట్టాలి. లేదంటే సముద్ర తీరానికి వెళ్లి సేద తీరి వచ్చేయాల్సిందే. ఎందుకంటే బీచ్ అందాలు ఆస్వాదించాలంటే జేబుకు చిల్లుపెట్టుకోవల్సిందే. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ధర నిర్ణయించారు. సాధారణంగా ఎక్కడైనా యూజర్ చార్జీల కింద ఐదో పరి రూపాయలు టిక్కెట్ పెడతారు. ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో రేటు పెట్టి వినియోగదారుడి మొహంలో నిరాశను మిగుల్చుతున్నారు. బీచ్‌లో అడుగు పెడితే ప్రతి ఒక్కరూ రూ.90 ముట్ట జెప్పాల్సిందే. ఈసారి బీచ్ ఫెస్టివల్‌కు గుడ్‌బై చెప్పి ఆ స్థానంలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు రత్నసిరి ఫుడ్ కోర్టు రిసార్ట్‌కు అనుమతిచ్చారు. ఒకరోజుపాటు ఉత్సవాలు జరిపేందుకు సదరు యాజమాన్యం భారీగా వసూలు చేయడానికి సమాయత్తమవుతోంది. రూ.500 నుంచి రూ.1000 వరకు రేటు పెట్టింది. ఆ ధర భరించేవారికే సంక్రాంతి సంబరాల ప్రవేశం ఉంటుంది. కుటుంబ సభ్యులూ...పారా హుషార్...! పిల్లలతో కలిసి బీచ్‌లో అడుగు పెడదామనుకుంటున్నారా? అయితే ఒక్కొక్కరు రూ.70 సిద్ధం చేసుకోవాలి. నలుగురున్న ఫ్యామిలీ వెళితే రూ.280 చెల్లిస్తే గానీ బీచ్‌ను ఆస్వాదించలేదు. ఇక, చిన్న పిల్లలే తోడైతే ఒక్కొక్కరికీ రూ. 30 అదనం కానుంది. దానికి తోడు నాలుగు చక్రాల వాహనంపై వెళితే అదనంగా రూ.20 చెల్లించాలి...అంటే ప్రవేశానికి ఒక ఫ్యామిలీ దాదాపు రూ.300 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బీచ్ ప్రవేశం ద్వారం దాటాలంటే అడుగు పెట్టాలంటే పెద్దలకు రూ.30, చిన్న పిల్లలకైతే రూ.10, గ్యాస్ బ్రిడ్జిని సందర్శించాలంటే పెద్దలు రూ.20, చిన్నపిల్లలు రూ.10, లేజర్ షో వద్దకు వెళ్లాలంటే పెద్దలు రూ.20, చిన్నపిల్లలు రూ.10 చెల్లించాలి. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నాలుగు చక్రాల వాహనానికైతే రూ. 20, ద్విచక్ర వాహనానికైతే రూ.10 చెల్లించాలి. బీచ్‌లో ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. దీంతో సెలవు రోజున సరదాగా వెళ్దామంటే ఒక కుటుంబానికి రూ.300పైబడి కేవలం టిక్కెట్ల కోసం వెచ్చించాలి. ఇక ఇతర తినుబండారాలకైతే చెప్పనక్కర్లేదు. బీచ్ ఫెస్టివల్ కొండెక్కినట్టే... డిసెంబరు లేదా జనవరిలో ప్రతి ఏడాదీ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్టుగా బీచ్‌లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు బీచ్ ఫెస్టివల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి నెలకుంది. కానీ, అనూహ్యంగా సంక్రాంతికి ముందు, ఈ నెల 12వ తేదీన బీచ్‌లో సంక్రాంతి సంబరాలు పేరుతో ఉత్సవాలు జరిపేందుకు రత్నసిరి ఫుడ్‌కోర్టు రిసార్ట్‌కు అనుమతి ఇచ్చారు. అవకాశం రావడమే తరువాయి సదరు యాజమాన్యం భారీ రేట్లు పెట్టింది. ఒక్కొక్కరికీ రూ.1000, 600, 500 మేర టిక్కెట్ రేట్లు పెట్టారు. ముందుగా బుక్ చేసుకోవాలని విస్తృత ప్రచారం కూడా చేసేస్తున్నారు. -
కాకినాడ సముద్రతీరంలో చమురు దొంగలు
-
కాకినాడలో విషాదం: తీరానికి మృతదేహాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గత గురువారం గల్లంతైన ఐదుగురులో ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. యూ.కొత్తపల్లి మండలం సుబ్బంపేట తీరానికి వారి మృతదేహలు కొట్టుకు వచ్చాయి. అదేరోజు ముగ్గురి మృతదేహాలు వెలికితీయగా, నేడు మరో ఇద్దరి మృతదేహాలు తీరంలో కనిపించాయి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం (కాపులపాలెం) పితానివారిపేటకు చెందిన పితాని గోవిందు, పితాని శ్రీను కుటుంబాలు, వారి చెల్లెలు శీలం తనుకులమ్మ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులు టాటా ఏసు గూడ్స్ ఆటోలో పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం సూర్యరావు పేట బీచ్ కి వచ్చారు. పితాని గోవిందు కుటుంబానికి చెందిన పితాని అనిత (16), పితాని రమ్య (18), పితాని వీరవంశీ (14), పితాని శ్రీను కుటుంబానికి చెందిన పితాని జయకృష్ణ (20), శీలం తనుకులమ్మ (30), శీలం దేవి (16) సముద్రంలోకి దిగిన వెంటనే ఓ రాకాసి అల వీరిని లోపలికి లాగేసుకుంది. సముద్రం ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు చూస్తుండగానే వీరంతా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు పితాని శ్రీను (36) సముద్రంలోకి దిగి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఏడుగురిలో ఇద్దర్ని స్ధానికులు ఎలాగోలా కష్టపడి రక్షించారు. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహలు ఆరోజే తీరానికి కొట్టుకువచ్చాయి. మిగిలిన ఇద్దరి మృదేహలు నాలుగురోజైన ఆదివారం తీరానికి కొట్టుకొచ్చాయి. సంబంధిత కథనాలు కాకినాడ బీచ్‌లో విషాదం కాటేసిన కడలి -
కాకినాడ బీచ్‌లో విషాదం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. విహార యాత్ర కాస్తా విద్యార్థుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సముద్ర స్నానానికి వెళ్లి తొమ్మిదిమంది విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అయిదు మృతదేహాలు బయటికి కొట్టుకువచ్చాయి. మరో ముగ్గుర్ని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతు అయిన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 19 మంది కాకినాడ బీచ్‌కి విహర యాత్రకు వచ్చారు. వీరంతా పక్కనే ఉన్న పాలరేవు మండలం కాపులపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందినవారు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు వంశీ, పండు, శీలం దుర్గ, పితాని శ్రీను, అనితగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
కాకినాడ బీచ్‌లో విషాదం
-
పర్యావరణ పరిరక్షణతో ఆర్థికాభివృద్ధి
ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్ కమాండెంట్ శర్మ బీచ్‌లో పరిశుభ్రతా కార్యక్రమం కాకినాడ రూరల్ : పర్యావరణ పరిరక్షణతో సామాజిక, ఆర్థికాభివృద్ధి ముడిపడి ఉందని ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్స్ కాకినాడ విభాగం కమాండెంట్ ఆర్.కె.శర్మ తెలిపారు. ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్స్ 40వ వార్షికోత్సవాల్లో భాగంగా సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌లో శనివారం ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి వంటి ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్నారు. కాకినాడ తీరంలో సముద్ర జలాలతో పాటు, బీచ్‌లో పర్యావరణ రక్షణకు ఏటా కోస్ట్‌గార్డ్ వార్షికోత్సవాల సందర్భంగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి సహకరిస్తున్న విద్యాసంస్థలు, మెరై¯ŒS పోలీస్, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గ్రామ పంచాయతీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్ట్‌గార్డ్స్ అసిస్టెంట్ కమాండెంట్ సి.వి.ఎ¯ŒS.మూర్తి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎ¯ŒSఎస్ఎస్ బోర్డు మెంబరు ఎం.సత్యనారాయణ, ఆదిత్య కళాశాల ఎ¯ŒSఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం సుబ్రహ్మణ్యం, ధరిత్రీ రక్షిత సమితి అధ్యక్షురాలు ఎస్.సురేఖ, మెరై¯ŒS పోలీస్ సీఐ రాజారావు, ఎస్ఐ లక్ష్మణస్వామి, సూర్యారావుపేట సర్పంచ్ యజ్జల బాబ్జీ, వాలకపూడి కార్యదర్శి బి.రత్నం, ఆదిత్య కళాశాల విద్యార్థులు, పలు స్వచంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. -
సంబరాల సాగరమై....