మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
ఒంగోలు : మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం ఒంగోలులోని స్వగృహంలో ఆయనకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రకాశం జిల్లా కొండపి నియోజక వర్గం నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా... ఓ సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు.