ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లక్సెట్టిపేట: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ముత్తె వెంకటేష్ (40) గురువారం రాత్రి పురుగుల ముందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ శుక్రవారం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.