నల్గొండ : తన పొలంలోకి వెళ్లటానికి దారివ్వటం లేదని మనస్తాపం చెంది ఓ రైతు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం ... మునుగోడుకు చెందిన తీరపారి నగేష్, ఎరసాని నగేష్‌లకు లక్ష్మీదేవిగూడెం సమీపంలో పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. అయితే తీరపారి నగేష్ తన పొలంలోకి వెళ్లాలంటే ఎరసాని నగేష్ పొలం మీదుగానే వెళ్లాలి.
ఎరసాని నగేష్ తన పొలం మీదుగా వెళ్లనీయక పోవటంతో తీరపారి నగేష్ తీవ్ర మనస్తాపం చెందాడు. దాంతో అతని ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అతడి సహచరులు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు లక్ష్మీదేవిగూడెం చేరుకుని తీరపారి నగేష్ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.