దరఖాస్తు దారులకు సరైన సమాచారం ఇవ్వని పెద్దకడబూరు తహసీల్దార్‌కు రూ.50,000 జరిమానా విధించినట్లు బాధితుడు వీరేష్ తెలిపాడు.
పెద్దకడబూరు తహసీల్దార్‌కు జరిమానా
Mar 14 2017 12:09 AM | Updated on Apr 4 2019 2:50 PM
ఆదోని అగ్రికల్చర్: దరఖాస్తు దారులకు సరైన సమాచారం ఇవ్వని పెద్దకడబూరు తహసీల్దార్‌కు రూ.50,000 జరిమానా విధించినట్లు బాధితుడు వీరేష్ తెలిపాడు. సమాచార హక్కు చట్టం కమిషన్ జారీ చేసిన జరిమానా కాపీని బాధితుడు సోమవారం ఆదోనిలో విలేకరులకు అందజేశారు. ఈ సందర్భంగా వీరేష్ తెలిపిన వివరాలు.. పెద్దకడబూరు మండలం తారాపురం గ్రామంలో మాదిగలకు 1976లో ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చిన లబ్ధిదారుల వివరాలు, ఇంటి పట్టా 75/1, గ్రామ కంఠం చిత్రం ఇవ్వాలని పెద్దకడబూరు తహసీల్దార్‌కు 2015, సెప్టెంబరు 9న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నామన్నారు. దీనికి సంబంధించిన సమాచారం తహసీల్దార్ ఇవ్వకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన కమిషన్ రూ.50 వేల జరిమానాతో పాటు బాధితుడి ఖర్చుల నిమిత్తం రూ.2 వేలను పదిరోజుల్లో చెల్లించాలని కెసి 39908/ఎస్‌ఐసి–ఎల్‌టీకె/2016 ఉత్తర్వులను 10–3–2017న జారీ చేసిందని వివరించారు.
Advertisement
Advertisement