- క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు
అల..అలా చేరుకున్నారు
Published Wed, Dec 14 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
పల్లిపాలెం (సఖినేటిపల్లి) :
వర్దా తుపాను ధాటికి సముద్రంలో బోటు అదుపుతప్పి పశ్చిమగోదావరి జిల్లా సంబలదీవి చేరుకున్న కాకినాడ రూరల్ ఏరియాకు చెందిన మత్య్సకారులు ఐదుగురు మంగళవారం మెరై¯ŒS పోలీసులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో క్షేమంగా వెనుతిరిగారు. ఈ నెల 10న కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన చక్కా సత్తిబాబు, కుమారులు పెద్దరాజు, చిన్నరాజు, వీరబాబు, సోదరుడు బాబ్జీరాజు బోటుపై ఒడ్డున వేటాడుకునేందుకు సముద్రంపైకి వెళ్లారు. బోటు కొంత దూరం వెళ్లే సరికి సముద్రం గాలులకు అదుపుతప్పింది. బోటులో ప్రయాణిస్తూ మూడు రోజులు సముద్రంపైనే ఉండిపోయారు. అదృష్టవశాత్తూ బోటు అనుకూల వాతావరణంలో పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, సంబలదీవి ప్రాంతాల సమీపానికి చేరడంతో వారికి పెనుప్రమాదం తప్పింది. స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో పల్లిపాలెం చేపల రేవుకు చేరుకుని, వీఆర్వో పోతురాజు బాబు ద్వారా అంతర్వేది మెరై¯ŒS పోలీసులను ఆశ్రయించారు. మెరై¯ŒS పోలీసు, రెవెన్యూ సిబ్బంది సాయంతో వారు ఐదుగురు క్షేమంగా వెనుతిరిగారు.
Advertisement
Advertisement