
తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు
తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఉదయం 9 గంటలు దాటిన పల్లెలు, పట్టణాల్లో మంచు కురుస్తునే ఉంటుంది.
గన్నవరం: తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఉదయం 9 గంటలు దాటిన పల్లెలు, పట్టణాల్లో మంచు కురుస్తునే ఉంటుంది. ఈ ప్రభావం విమాన రాకపోకలపై తీవ్ర అంతరాయం చూపుతుంది.
విజయవాడ నగరంతోపాటు గన్నవరం విమానాశ్రయాన్ని ఆదివారం ఉదయం పొగమంచు కప్పేసింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేయగా, కొన్ని ఆలస్యంగా నడవనున్నాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్రఅవస్థలు పడుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.