
నయీం చనిపోవడం ఆనందంగా ఉంది : సాంబశివుడు తండ్రి
నల్లగొండ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ నయీం చనిపోవడం ఆనందంగా ఉందని మాజీ మావోయిస్టు సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. నల్లగొండలో సోమవారం ఆయన మాట్లాడుతూ...నయీం చావడంతో పీడ వదిలిందన్నారు.
నయీం అనుచరులను కూడా పోలీసులు మట్టుబెట్టాలని...అప్పుడే దేశం బాగుపడుతుందని చంద్రయ్య చెప్పారు. నల్లగొండ జిల్లాలో 2011లో సాంబశివుడు, 2014లో ఆయన సోదరుడు రాములును నయీం గ్యాంగ్ అత్యంత కిరాతకంగా హత్య చేసిందని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.