chandraiah
-
ఆయన జీవితం స్ఫూర్తిమంతం
ఈ దేశంలో నిజమైన పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాకమునుపే, నకిలీ విజేతలు వెలిగిపోయారు. ఇప్పుడు ఆ మూసను బద్ధలుకొట్టడమే ఈ తరం చేయాల్సిన పని. ‘నా అన్వేషణలో కత్తి చంద్రయ్య’ అనే జీవితగాథ రాసిన కత్తి కళ్యాణ్ చేసింది ఇదే! ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తే ఒక మహామనిషితో కరచాలనం చేస్తాం. తెలుగు నేల నుంచి ఆవిర్భవించిన తొలి దళిత కలెక్టర్ ‘పేదల కలెక్టర్’గా ఎట్లా ఎదిగి వచ్చాడో తెలుసుకుంటాం. ఆయన చేసిన సేవలకు ఆయనే గనుక ఉన్నతవర్గంలో పుట్టి ఉంటే ఈ పాటికి ఆయన పేరు నలుదిశలా మార్మోగేది.1924లో నిరుపేద రైతుకూలీ కుటుంబంలో జన్మించిన కత్తి చంద్రయ్య చదువే లోకంగా ఎదిగి వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు మద్రాసులో సైతం ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత మొదటి కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సైతం ఆయన కలెక్టర్‌గా సేవలందించారు. ఏ జిల్లాలో ఉద్యోగం చేసినా తనదైన మార్క్ ఉండేది. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, పేదలకు పంచాలన్నా కత్తి చంద్రయ్యకే సాధ్యం అనేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.ఆయనలో ఒక గొప్ప మేధావి ఉన్నాడు. పురాతన చరిత్రను తెలుసు కోవడం, పత్రికలకు, మ్యాగజైన్లకు వ్యాసాలరూపంలో రాసి ప్రచారం చేయడం అభిరుచిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంచి పాఠకుడిగా ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. అలాగే తన పరిశోధనలో తెలుసుకున్న విషయాలను ఈ సమాజం ముందు పెట్టడానికి విలువైన రచనలు చేశారు. ‘దళిత్ ఎకానమీ’ అనే రచన అందులో ఒకటి. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో వేమన వంటి ప్రజా కవులను గురించి కూడా వ్యాసాలు రాశారు.చదవండి: కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!ఈ పుస్తకంలో చంద్రయ్య కాలం నాటి దినపత్రికల కట్టింగ్లను పొందు పరిచాడు రచయిత. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇవాళ పరాజిత జాతుల చరిత్రలన్నీ వెలికితీసే పని మరింతగా జరగాలి. నిజం చెప్పులేసు కునేలోపే, అబద్ధాలు ప్రపంచమంతా తిరిగి వస్తున్న యుగంలో మనం జీవి స్తున్నాం. నిజాలకు పట్టం కట్టాలి, నిజమైన ఆదర్శనీయుల చరిత్రను ఈ సమాజానికి అందించాలి. ఈ పుస్తకం విరివిగా ప్రజల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా విద్యార్థులు చదవాలి. చంద్రయ్య పేరు మీద ఉత్తమ అధికారులకూ, పరిశోధ కులకూ, చరిత్ర రచయితలకూ అవార్డులివ్వాలి. ఇందుకోసం ప్రజలు, ప్రభు త్వాలు పూనుకోవాలి. ఆ దిశలో వ్యవహరించడానికి అవసరమైన చైతన్యం కలిగించడానికి ఈ పుస్తకం ఒక దారి చూపుతుంది.– డాక్టర్ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడెమియువ పురస్కార గ్రహీత -
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్‌లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్‌లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
మిర్యాల చంద్రయ్య ఇకలేరు.. పశువుల కాపరి నుంచి వైస్ చాన్సలర్ స్థాయికి..
సాక్షి, మన్యం పార్వతీపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పూర్వపు ఇన్చార్జి వైస్ చాన్సలర్, రూరల్ డెవలప్మెంట్ విశ్రాంత ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య (67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. పశువుల కాపరిగా ప్రస్థానం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చంద్రయ్యది విజయనగరం జిల్లా. పాలేరు కుమారుడిగా జీవితం ప్రారంభించి బాల్యంలో అనేక కష్టాలు పడ్డారు. పశువుల కాపరిగా పనిచేశారు. వసతి గృహల్లో చదువుకుని ఆంధ్రావిశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. 2008లో జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలో పనిచేస్తున్న వారిలో 34 మంది ఏయూ మాతృ సంస్థకు వెళ్లిపోగా, ఐదుగురు మాత్రమే ఇక్కడ ఉండిపోయా రు. అందులో చంద్రయ్య ఒకరు. వర్సిటీలో విభాగా ధిపతిగా, ప్రిన్సిపాల్‌గా, చీఫ్ వార్డెన్‌గా అనేక బాధ్యతలు నిర్వహించారు. రెక్టార్ హోదాలో 2016 మే 14 నుంచి 2017 జూన్ 30 వరకు ఇన్చార్జి వైస్ చాన్సలర్‌గా వ్యవహరించారు. వీసీగా పనిచేస్తూనే రెగ్యులర్ గా తరగతులు బోధించేవారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించేవారు. సమయపాలన పక్కా.. చంద్రయ్య సమయ పాలన కచ్చితంగా పాటించేవారు. ఇన్చార్జ్ వీసీగా సమయంలో బోధకులు సమయపాలన పాటించకపోతే సహించేవారు కాదు. దీంతో బోధకు లు ఆయనపై తిరగబడ్డారు. మీరు వీసీనా.. వాచ్ మ్యానా..? అంటూ ప్రశించారు. తాను వర్సిటీకి వాచ్డాగ్ అంటూ సమాధానం ఇచ్చారు. సమయపాలన పాటించకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల ఉత్తమ ఉపాధ్యా య విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఈయన మృతి పట్ల ప్రస్తుత వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ఏ రాజేంద్రప్రసాద్, పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ప్రొఫెసర్ పీలా సుజాత సంతాపం తెలియజేశారు. -
బాధ్యతలు స్వీకరించిన హెచ్చార్సీ చైర్మన్
నాంపల్లి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్చార్సీ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ విచ్చేసి కమిషన్ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 2016, డిసెంబర్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చివరి చైర్మన్‌గా జస్టిస్ సిస్సార్ అహ్మద్ కక్రూ పనిచేశారు. తదనంతరం కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, సభ్యులతో బెంచ్ ఏర్పాటైంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యులు మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ... ప్రాథమిక హక్కులే మానవ హక్కులని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
చంద్రయ్య విషాదాంతం
పెద్దఅంబర్‌పేట, శంషాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నవంబర్ 4న విజయారెడ్డిపై కార్యాలయంలోనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. విజయారెడ్డిని కాపాడబోయిన కారు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య గాయపడ్డారు. అయితే, గురునాథం 5న చికిత్స పొందుతూ మృతి చెందగా, హత్యకు కారణమైన కూర సురేశ్ 8న మృతిచెందాడు. ఇక చంద్రయ్య డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ సోమవారం ప్రాణాలొదిలాడు. మృతులందరికీ చిన్నపిల్లలే.. ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికీ చిన్న పిల్లలే ఉన్నారు. విజయారెడ్డికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. నిందితుడు సురేశ్‌కు కూతురు, కుమారుడు, డ్రైవర్ గురునాథంకు ఏడాదిన్నర వయసు కుమారుడు, అటెండర్ చంద్రయ్యకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. రాళ్లగూడలో అంత్యక్రియలు చంద్రయ్య అంత్యక్రియలు సోమవారం శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడలో జరిగాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన చంద్రయ్య జిల్లాల విభజన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంలో అటెండర్‌గా నియమితులయ్యా రు. ఆయన తన భార్య పద్మమ్మ, పిల్లలు అభినవ్, కీర్తనలతో కలసి ఉంటున్నారు. ఘటన జరిగాక ప్రభుత్వం వైద్యం చేయించినా ఇంతవరకు ఆర్థిక సాయం చేయలేదని కుటుంబ సభ్యులన్నారు. ట్రెసా చేయూత సాక్షి, హైదరాబాద్: చంద్రయ్య కుటుంబానికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) బాసటగా నిలిచింది. అత్యవసర ఖర్చులకుగాను చంద్రయ్య కుటుంబ సభ్యులకు ట్రెసా సంఘం నాయకులు రూ. లక్ష అందజేశారు. డ్యూటీకి వెళ్లిన రోజు నుంచి మళ్లీ ఇప్పుడే.. డ్యూటీకి వెళ్లిన రోజు మా నాన్నను చూశాం.. ఆ తర్వాత మేము ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ఈ రోజు చనిపోయాడని చెప్పారు. మా నాన్న బతికుండగా చూసి చనిపోయిన తర్వాత మళ్లీ ఈరోజే చూడాల్సి వచ్చింది. మా నాన్ననే ఇంటికి ఆధారం.. మేము ఇప్పుడు పదో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని ఎవరు చదివిస్తారు.. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – చంద్రయ్య కుమారుడు అభినవ్, కుమార్తె కీర్తన -
అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు చంద్రయ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాలని కుటుంబసబ్యులకు డీఆర్‌డీఓఅపోలో ఆసుపత్రి వర్గాలు సూచించాయి.అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వాధికారులు సూచించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో.. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే. -
స్వాతంత్ర్య సమరయోధుడు పడాల చంద్రయ్య కన్నుమూత
-
చంద్రయ్య యాదవ్ అరెస్టు
జగద్గిరిగుట్ట: బాచుపల్లి గ్రామంలోని 32 ఏకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో ప్రధాన సూత్రధారి పోతరాజు రామచంద్రుడు అలియాస్ చంద్రయ్య యాదవ్(53)ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎస్హెచ్ఓ బాలక్రిష్ణారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ చౌదరి దామోదర్‌రావు అనే వ్యక్తి ఈ నెల 14న సర్వే నంబర్ 140,141లోని తన భూమి 32.33 ఎకరాలు అక్రమించుకోవడానికి కొందరు నకిలీ పత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకుగాను అక్రమార్కులు బుక్ –1,వ్యాలూమ్–440లో 7 మార్టిగేజ్ డ్యాక్యూమెంట్ డిడ్స్ తొలగించి వాటి స్థానంలో 6 తప్పుడు సేల్ డీడ్ పత్రాలు ఉంచారు. ఇందుకుగాను ప్రధాన నిందుతుడు చంద్రయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్‌లు తయారీ మెషిన్‌ను కొనుగోలు చేసి దాని ఆధారంగా ఎస్ఆర్ఓ ఆఫీస్ స్టాంప్‌లు తయారు చేసినట్లు తెలిపారు. నకిలీ డీడ్లు షాపూర్‌నగర్‌లోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద టైప్ చేయించి దానికి సేల్ డీడ్ డ్రాఫ్ట్‌లను తన ల్యాప్‌టాప్‌లో స్వయంగా తయారు చేశాడు. ఎస్ఆర్ఓ కార్యాలయ సిబ్బంది సాయిబాబా, మురళీలకు రూ. 5 లక్షలు లంచం ఇచ్చి బుక్–1,వ్యాలూమ్ 440లోని ఒరిజినల్ మార్టిగేజ్ డాక్యుమెంట్లను తొలగించి వాటి స్థానంలో 6 నకిలీ పత్రాలు చేర్చాడు. భూమి యాజమాని చనిపోయినట్లుగా తెలుసుకుని మృతుడు కృష్ణమూర్తి తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన పద్దిరెడ్డికి విక్రయించినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. అయితే పద్దిరెడ్డి సైతం చనిపోయిన తరువాతే ఈ వ్యవహారం నడపడం గమనార్హం. దీనికితోడు గాజులరామారం, సూరారం తదితర ప్రాంతాల్లో సైతం మరో ఐదు నకిలీ పత్రాలు సృష్టించాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నట్లు తెలుసుకున్న చంద్రయ్య యాదవ్ తన వద్ద ఉన్న బుక్–1, వ్యాలూమ్440 నుంచి తొలగించిన ఒరిజినల్ మార్టిగేజ్ పత్రాలు , నకీలీ సేల్ డీడ్లు ,రబ్బర్ స్టాంప్‌లను తీసుకెళ్లి కిష్టాయిపల్లి గ్రామం పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిలో తగుల బెట్టాడు. చంద్రయ్య యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ల్యాప్ టాప్, ప్రింటర్, రబ్బర్ స్టాప్ మేకింగ్ మిషన్, ఖాళీ రబ్బర్ స్టాప్‌లతో పాటు, 6 మొబైల్ ఫోన్లు, బైక్, కారులను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్మశానవాటికలో వ్యక్తి ఆత్మహత్య
పెబ్బేరు మండలకేంద్రంలోని స్మశానవాటిక సమీపంలో ఓ వ్యక్తి స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గోపాల్పేట్ మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఎరుకలి చంద్రయ్య(46)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీసీఎం, క్రూజర్ వాహనం ఢీ..ఇద్దరి మృతి
ఆమనగల్లు మండలం కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై డీసీఎం, క్రూజర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన గొల్ల చంద్రయ్య(45), సాలమ్మ(55)లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రోగాల నివారణలో ముందుండాలి
కాజీపేట : నానో మెడిసిన్, నానో టెక్నాలజీలను ఉపయోగించి ధీర్ఘకాలిక రోగాలను నయం చేసేందుకు ఉన్న అవకాశాలపై విద్యార్థులు మ రింతగా శాస్త్రీయ ధృక్పథంతో పరిశోధనలు చేయాలని ప్రతిషా్ఠత్మక నిప్ప ర్ ప్రొఫెసర్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. సోమిడి శివారులోని నేతా జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్స్ కళాశాలలో ఆదివారం ‘ఫార్మారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కా ర మార్గాలు’ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రయోగాలపై పట్టు ను సాధించి నూతన ఔషదాలను తయారు చేసేందుకు మరింతగా పరిశోదనలు చేయాలని సూచించారు. దీంతో ఫార్మా రంగానికి దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయన్నారు. కళాశాల సెక్రటరీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో కళాశాల విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిపుణులైన విద్యావేత్తలతో మరిన్ని అవగాహన సదస్సులు ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్న ట్లు ప్రకటించారు. చంద్రయ్యను విద్యారు ్థలు, కళాశాల యాజమాన్యం సన్మానించింది. -
'నయీం చనిపోవడం ఆనందంగా ఉంది'
-
అడ్డొస్తే అంతమే.. ఇదీ నయీమ్ రక్తచరిత
-
అడ్డొస్తే అంతమే.. ఇదీ నయీమ్ రక్తచరిత
పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగా తన అనుచరులతో దారుణ హత్యలు చేయించడంలో నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీమ్ సిద్ధహస్తుడు. ఎక్కువగా వేట కొడవళ్లు, కత్తులతోనే మర్డర్లు చేయించేవాడు. అనుచరులతో నేరాలు చేయించడం, ఆ తర్వాత వారు అరెస్టయ్యే విధానం సైతం పక్కా ప్రణాళికా బద్ధంగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీమ్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయారు. నేరాల్లో పాల్గొనే వారు ఒకరైతే.. 48 గంటల్లోనే పోలీసులకు లొంగిపోయే వారు మరికొందరు ఉంటారు. నయీమ్ నేరచరిత్ర ఇదీ.. - సాక్షి, హైదరాబాద్/నల్లగొండ క్రైం/చౌటుప్పల్ ఇదీ నయీమ్ రక్తచరిత * ఐపీఎస్ వ్యాస్ నుంచి పటోళ్ల దాకా.. * ఎందరినో కిరాతకంగా హతమార్చిన నేరగాడు * అనుచరులతో కలసి పక్కాగా స్కెచ్.. అదను చూసి వేటు బెల్లి లలితను ముక్కలుగా చేసి.. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు బెల్లి లలితను 1999 జూన్ 26న నయీమ్ భువనగిరిలో హత్య చేసి శరీర భాగాలను వేట కొడవళ్లతో 18 ముక్కలుగా చేసి జిల్లా అంతటా పడవేయడం సంచలనం సృష్టించింది. భువనగిరిలోని చేతబావి, బస్టాండు, వివిధ ప్రాంతాల్లో లలిత శరీర భాగాలను ముక్కలుగా పడవేశారు. ముగ్గురిని నరికి.. పాతిపెట్టి బెల్లి లలిత అనుచరులైన ముగ్గురిని నయీమ్ అతి దారుణంగా చంపాడు. ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ఇక్కిరి సైదులు, సంస్థాన్ నారాయణపురానికి చెందిన బద్దుల మల్లేశ్ యాదవ్, మాదారానికి చెందిన శ్రీరాముల రాములును నయీమ్ హైదరాబాద్‌లో పట్టుకున్నాడు. 2001 డిసెంబర్ 24న చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులో, సబ్‌స్టేషన్ సమీపంలో ఈ ముగ్గురిని ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల, మొండెంలను వేరు చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పాతి పెట్టాడు. ఓ పశువుల కాపరికి భూమిలోంచి ఓ చేయి కనిపించింది. తవ్వి చూస్తే 6 చేతులు, 6 కాళ్లు బయటపడ్డాయి. మరో 2 చోట్ల తవ్వగా, మొండెం, తల భాగాలు లభ్యమయ్యాయి. పౌర హక్కుల నేత అజాం అలీని.. పౌరహక్కుల సంఘం నేత అజాం అలీని 2001 ఫిబ్రవరి 17న నల్లగొండలోని అంబేడ్కర్ భవన్ ముందు నయీమ్ తన ముఠా సభ్యులతో కలసి హత్య చేశాడు. పౌరహక్కుల సంఘం సమావేశానికి పాల్గొనేందుకు వచ్చిన అజాం అలీని వేట కొడవళ్లతో నరికి చంపారు. సోమ రాధాకృష్ణను వేట కొడవళ్లతో.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన సోమ రాధాక ృష్ణ ఎల్బీనగర్ చౌరస్తాలో మిట్టమధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. స్టోన్ క్రషింగ్ యూనిట్ నిర్వహిస్తున్న ఈయన బడా బిల్డర్లకు సరుకు సరఫరా చేసేవారు. ఈయనను బెదిరించి డబ్బు గుంజేందుకు నయీమ్ వేసిన పథకం పారలేదు. దీంతో తన అనుచరులైన షకీల్, జహంగీర్, యాకుబ్, ఇమ్రాన్, జఫార్, హాజీ, రిజ్వీలను రంగంలోకి దింపాడు. వీరంతా కలసి 2010 నవంబర్ 29న రాధాకృష్ణను వేటకొడవళ్లతో దారుణంగా నరికి పరారయ్యారు. బండరాళ్లతో మోది శ్రీధర్‌రెడ్డిని.. నయీమ్ ప్రధాన అనుచరుడిగా పని చేసిన ఉప్పల్ వాసి జహంగీర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీధర్‌రెడ్డి సైతం దారుణంగా హత్యకు గురయ్యాడు. 2011 నవంబర్ 24న నయీమ్ ముఠా శ్రీధర్‌రెడ్డిని కిడ్నాప్ చేసింది. ఈయన్ను పహాడీషరీఫ్ ప్రాంతంలో బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు. ఐపీఎస్ వ్యాస్ హత్యలో.. హైదరాబాద్ నడిబొడ్డున.. అప్పటి పోలీసు కంట్రోల్‌రూమ్ వెనుక ఉన్న ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ 1993 జనవరి 27న దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో హైదరాబాద్ రేంజ్ డీఐజీగా పని చేస్తున్న వ్యాస్ పలు జిల్లాల్లో నక్సల్స్ అణచివేతలో సమర్థవంతంగా పని చేయడంతో పాటు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన గ్రేహౌండ్స్‌కు ఆద్యుడిగా నిలిచారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ గ్రూప్ వ్యాస్‌ను టార్గెట్ చేసింది. అప్పటి కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నిమ్మలూరి భాస్కర్‌రావు నేతృత్వంలో మేకల దామోదర్‌రెడ్డి అలియాస్ మదన్, అప్పారావు, నయీముద్దీన్ సహా మొత్తం 21 మంది రంగంలోకి దిగారు. ఉదయం 6.30 గంటలకు వాకింగ్ చేస్తున్న వ్యాస్పై ఎల్బీ స్టేడియం గేట్ నం.2 నుంచి వచ్చిన యాక్షన్ టీమ్ సభ్యులు మదన్, అప్పారావు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వ్యాస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన పక్కనే ఉన్న మరో ఐపీఎస్ దినేశ్‌రెడ్డితో పాటు గన్మెన్లు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. ఆ సమయంలో సమీపంలో ఉన్న పోలీసుల దృష్టి మళ్లించడంతో పాటు, కాల్పులు జరిపిన వారు పారిపోవడానికి వీలుగా గేట్ నం.4 వద్ద నయీమ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ కేసులో ఇతడు రెండో నిందితుడు. సాంబశివుడి హత్యలో.. బెల్లి లలిత హత్యకు ప్రతీకారంగా నయీం సోదరుడు అలిమొద్దీన్ను 1999 డిసెంబర్ 7న భువనగిరిలో కొనపురి రాములు హత్య చేశాడు. దీంతో రాములు, అతడి సోదరుడు కొనపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడిపై నయీమ్ పగ పెంచుకున్నాడు. 2011 మార్చి 26న గోకారం గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొని వస్తుండగా నయీమ్ అనుచరులు సాంబశివుడి కారును అడ్డగించి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఈ కేసులో నయీమ్ ఏ-1 నిందితుడు. అలాగే సాంబశివుడి సోదరుడు, టీఆర్ఎస్ నేత కొనపురి రాములును 2014 నవంబర్ 11న నయీమ్ ముఠా హత్య చేసింది. నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఓ వివాహ వేడుకకు హాజరైన రాములుపై ఈ ముఠా కాల్పులు జరిపి పరారైంది. గ్రీన్‌టైగర్స్ పేరుతో.. పురుషోత్తం ఐపీఎస్ వ్యా స్ హత్య కేసులో అరెస్టైన నయీమ్ తన పంథా మార్చుకున్నాడు. తొలుత పీపుల్స్ వార్‌లో చేరిన ఇతడు.. తర్వాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయం అని ప్రకటించాడు. ఈ నేపథ్యం లోనే నక్సల్స్ తరఫున వాణి వినిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్సీ) నేత పురుషోత్తంను ‘గ్రీన్‌టైగర్స్’ పేరుతో 2000 నవంబర్ 23న సరూర్‌నగర్ పరిధిలోని మధుపురికాలనీలో పట్టపగలు నడిరోడ్డుపై అనుచరులతో కలసి దారుణంగా హత్య చేశాడు. పటోళ్ల గోవర్ధన్‌రెడ్డిని కత్తులతో నరికి.. ఓ స్థల వివాదంలో విప్లవ దేశభక్త పులులు (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు, ఘరానా నేరగాడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డిని నయీమ్ 2011 డిసెంబర్ 27న నడిరోడ్డుపై చంపించాడు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్యకేసులో నిందితుడైన గోవర్ధన్‌రెడ్డి ఆటోలో ప్రయాణిస్తుండగా హైదరాబాద్‌లోని బొగ్గులకుంట వద్ద పట్టపగలు నడిరోడ్డుపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. పటోళ్ల అనుచరుడైన అనిల్ అలియాస్ అంజయ్యను కోవర్టుగా మార్చుకున్న నయీమ్ ఈ పని చేయించాడు. -
నయీమ్ X సాంబశివుడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాంబశివుడు, నయీమ్.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఈ ఇద్దరు మాజీ మావోయిస్టుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచింది. సైద్ధాం తికంగా వచ్చిన విభేదాలు వ్యక్తిగతంగా మారి ఒకరినొకరు చంపుకొనేందుకు ప్రయత్నించేదాకా వెళ్లింది. ఇద్దరిదీ పీపుల్స్‌వార్ నేపథ్యమే అయినా చెరోదారి పట్టారు. సాంబశివుడు మావోయిస్టు పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్లగా.. నయీమ్ పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చాక గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకొనేందుకు చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. చివరకు సాంబశివుడిని, ఆయన సోదరుడు రాములును నయీమ్ ముఠా హత్య చేయగా.. నయీమ్ ఇప్పుడు పోలీసుల చేతిలో హతమయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత.. సాంబశివుడి కంటే ముందే నయీమ్ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లాడు. యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబుదాడి చేసిన తర్వాత జైలుకు వెళ్లాడు. అక్కడ పీపుల్స్‌వార్ అగ్రనేతలతో ఏర్పడిన పరిచయం ఆయనను కీలకంగా మార్చింది. అయితే తర్వాత పార్టీతో విభేదించిన నయీమ్ బయటకు వచ్చేశాడు. నయీమ్ తర్వాత పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన సాంబశివుడు ఆ పార్టీలో చాలా ఎదిగారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో, మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో గుర్తింపు పొందాడు. తర్వాత వ్యక్తిగత కారణాల రీత్యా మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలం అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. తర్వాత ఆయన కూడా సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలున్నాయి. సాంబశివుడు పార్టీలో ఉన్నప్పుడే నయీమ్‌తో విభేదాలు వచ్చాయి. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడం, ఒకరిది మావోయిస్టు అనుకూల, మరొకరిది వ్యతిరేక సిద్ధాంతం కావడంతో విభేదాలు పెరిగాయి. నయీం అనుచరులనూ మట్టుబెట్టాలి: సాంబశివుడు తండ్రి వలిగొండ: నయూంను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం హర్షణీయమని అతని చేతిలో హత్యకు గురైన సాంబశివుడు, రాములుల తండ్రి చంద్రయ్య పేర్కొన్నా రు. ఉద్యమ బాట వీడి ప్రజాసేవ చేయడానికి వచ్చిన తన ఇద్దరు కుమారులను నయీమ్ పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నయీమ్ అనుచరులను కూడా మట్టుబెట్టాలని పేర్కొన్నారు. కోబ్రాల పేరిట పాములు సాంబశివుడిపై ఉన్న పగను నయీమ్ అనేకసార్లు బయటపెట్టాడు. బ్లాక్ కోబ్రాల పేరిట సాంబశివుడి తల్లిదండ్రులు నివాసముండే ఇంటి ముందు త్రాచు పాములు వదిలిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సాంబశివుడిని, మావోయిస్టులను చంపుతానని నయీమ్ అనేకసార్లు ప్రకటించాడు. సాంబశివుడి తల్లిదండ్రులను బెదిరించారని అప్పట్లోనే వారు ఆరోపించారు.ఇక నయీమ్ హత్యకు మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడే సాంబ శివుడు ప్లాన్ వేశాడు. నయీమ్ కోసం ప్రత్యేకంగా గెరిల్లా స్క్వాడ్‌ను రంగంలోకి దింపినా ఫలితం సాధించలేకపోయాడు. కానీ సాంబశివుడు, ఆయన సోదరుడు రాములును నయీమ్ పక్కా ప్లాన్ వేసి హత్య చేయించాడు. -
నయీం చనిపోవడం ఆనందంగా ఉంది : సాంబశివుడు తండ్రి
నల్లగొండ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ నయీం చనిపోవడం ఆనందంగా ఉందని మాజీ మావోయిస్టు సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. నల్లగొండలో సోమవారం ఆయన మాట్లాడుతూ...నయీం చావడంతో పీడ వదిలిందన్నారు. నయీం అనుచరులను కూడా పోలీసులు మట్టుబెట్టాలని...అప్పుడే దేశం బాగుపడుతుందని చంద్రయ్య చెప్పారు. నల్లగొండ జిల్లాలో 2011లో సాంబశివుడు, 2014లో ఆయన సోదరుడు రాములును నయీం గ్యాంగ్ అత్యంత కిరాతకంగా హత్య చేసిందని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. -
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన వీడ్కోలు
► 9న పదవీ విరమణ చేయనున్న ఇరువురు న్యాయమూర్తులు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. మే 2 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వారిద్దరికీ వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని శుక్రవారమే ఏర్పాటుచేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులు తమకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే మాట్లాడుతూ...జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ కాంతారావులు న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల తరఫున వాటి అధ్యక్షులు సి.నాగేశ్వరరావు, గండ్ర మోహనరావులు ఘనంగా సన్మానించారు. -
స్టేషన్ ముందు బాధిత కుటుంబం ఆందోళన
లింగాల ఘణపూర్: వరంగల్ జిల్లా లింగాల ఘణపూర్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ బాధిత కుటుంబం స్థానిక నాయకులతో కలసి ఆందోళనకు దిగింది. మండల కేంద్రానికి చెందిన జాగరి చంద్రయ్య ఇంట్లో ఈ నెల 16వ తేదీన చోరీ జరిగింది. రూ.1.20 లక్షల నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్టు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పోలీసులు విచారణలో భాగంగా బాధితుడు చంద్రయ్య కాల్ డేటాను పరిశీలించారు. అందులో చోరీ జరిగిన సమయానికి ముందు, తర్వాత ఓ మహిళ నంబర్‌కు కాల్స్ చేసినట్టు ఉంది. దీంతో పోలీసులు సోమవారం సాయంత్రం చంద్రయ్యను పిలిపించి విచారించారు. ఆ మహిళతో ఏం సంబంధం అంటూ దాడి చేసినట్టు సమాచారం. తన భర్తను అకారణంగా కొడుతున్నారంటూ చంద్రయ్య భార్య శారద పీఎస్ వద్దకు పిల్లలతో చేరుకుని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోతే స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి చంద్రయ్యను విడిచిపెట్టారు. నగదు, బంగారం వస్తువులు చోరీకి గురి కావడంతో పాటు ఫిర్యాదు ఇచ్చినందుకు దాడి చేసి కొట్టారని ఆరోపిస్తూ చంద్రయ్య కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలసి మంగళవారం ఉదయం స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
సదాశివపేట (రంగారెడ్డి జిల్లా): రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మోమిన్‌పేట మండలం దుర్గంచెరువు గ్రామ వీఆర్వో చంద్రయ్య (50), అదే గ్రామానికి చెందిన అంజయ్య గురువారం రాత్రి 7.30 సమయంలో సదాశివపేట నుంచి దుర్గంచెరువుకు బైక్‌పై వెళ్తున్నారు. వికారాబాద్ రోడ్డు కొత్తచెరువు సమీపంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన చంద్రయ్యను 108 వాహనంలో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రయ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు తెలిపారు. -
ఆదుకుంటామని.. ముఖం చాటేశారు
ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇల్లాలు దీనావస్థలో భర్త, పిల్లలు ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటి దీపం ఆరిపోయింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇల్లాలు అకాల మరణంతో ఆగమైంది. అండగా ఉండి ఆదుకుంటామని, ఆడపిల్లలను చదివిస్తామని, గుడిసె జీవితానికి స్వస్తి చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పిన నాయకులు ఆ తర్వాత ముఖం చాటేయడంతో మానసిక స్థితి సరిగా లేని తండ్రిని చూసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు పేదింటి పిల్లలు. నాడు హామీ ఇచ్చిన నేతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. - వెల్దుర్తి వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ శివారులోని బుడగజంగాల కాలనీకి చెందిన మోతె సత్తెమ్మ, చంద్రయ్య నిరుపేద దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం భార్యాభర్తలు వివిధ గ్రామాల్లో నిర్వహించే సంతల్లో పూసలు, అద్దాలు, బొట్టు, పిన్నీసులు తదితర వస్తువులను విక్రయించే వారు. వచ్చిన దాంతో తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆనందంగా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. కలల గూడు చెదిరిపోయింది. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో 2011 ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరయ్యేందుకు నియోజకవర్గంలోని చిన్నశంకరంపేటకు చెందిన నాయకులు, కార్యకర్తలు వెల్దుర్తి మీదుగా నర్సాపూర్ బయలు దేరారు. ఈ క్రమంలో కుకునూర్ నుంచి వెల్దుర్తికి టీవీఎస్పై వెళ్తున్న మోతె సత్తెమ్మ, చంద్రయ్యను బహిరంగ సభకు వెళ్తున్న వాహనాల శ్రేణిలో ఓ డీసీఎం వీరిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్తెమ్మ అదే రోజు మృత్యువాత పడింది. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళియాదవ్ మృతురాలి కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లలకు బట్టలు, బియ్యం, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఇద్దరు ఆడపిల్లలను హాస్టల్లో చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని, పక్కా గృహం నిర్మించి ఇస్తామని చెప్పారు. కాలం గడిచిపోయింది కానీ హామీ ఇచ్చిన నేతలు మళ్లీ కానరాలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. అమ్మ మృతితో మా సంతోషం పోయింది. నాన్న ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. అన్న పేతూరు కూలీపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. రెండేళ్ల క్రితం అక్క వివాహం కాలనీ వాసుల ఆర్థికసాయంతో చేశాం. ఉండేందుకు ఇల్లు లేక ఇప్పటికీ గుడిసెలోనే జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి. - మౌనిక, మృతురాలి కుమార్తె -
పల్లె గొల్లుమంది
నవాబుపేట: నవాబుపేట మండలం కూచురు గ్రామంలో చంద్రయ్య కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులను పోషిస్తున్నాడు. చంద్రయ్య భార్య దుర్గమ్మ కూడా కూలి పనులు చేసేది. అయితే, ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. శుక్రవారం మధ్యాహ్నం భర్త చంద్రయ్య ఊళ్లోకి వెళ్లిన సమయంలో ఆమె కూడా గ్రామంలోకి వెళ్లి మద్యం తాగి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన చంద్రయ్య భార్యను మందలించి ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త మందలించాడన్న కారణంతో సాయంత్రం సాకలి దుర్గమ్మ (36) తన ఇద్దరు కొడుకులకు బలవంతంగా గుళికలు తాగించి.. తానూ తాగింది. బలవంతంగా గుళికలు తాగించడంతో ఇద్దరు పిల్లలు గట్టిగా ఏడ్చారు. దీంతో చుట్టుపక్కల వారు గ్రహించి గ్రామంలోకి వెళ్లిన చంద్రయ్యకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో చంద్రయ్య భార్యా పిల్లలను 108లో జిల్లాకేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పెద్ద కుమారుడు శివకుమార్ (10) మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గమ్మ (36), చిన్న కుమారుడు గణేశ్ (07)లు తనువు చాలించారు. మేమేం పాపం చేశాం... తల్లి ఏ పని చెప్పినా చేసే చిన్నారులు.. చివరకు ఆమె కర్కశత్వానికి బలైపోయారు. ఎప్పుడూ తమ క్షేమం గురించే ఆలోచించి.. తమ ఆకలి బాధను తీర్చే తల్లి తమ ప్రాణాలనే తీస్తుందనుకోలేదు. తల్లి ఏమిచ్చినా తమ మంచి కోసమేనని అనుకున్న ఆ చిన్నారులు ఆ విషాన్ని పెరుగన్నంలా తాగారు. గ్రామంలో అందరితో కలియదిరిగిన ఆ చిన్నారులు తల్లి మూర్కత్వంతో అనంతలోకాలకు చేరుకున్నారని గ్రామస్తులు కంటనీరు పెట్టుకున్నారు. మృతుల నేత్రాలు దానం ఆత్మహత్య చేసుకున్న తల్లి, ఇద్దరు కొడుకుల నేత్రాలను దానం చేశారు. ఆస్పత్రిలో డాక్టర్లు వీరి కళ్లను బంధువుల అనుమతితో తీసుకున్నారు. కేసు నమోదు...ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మృతురాలి భర్త చంద్రయ్య ఫిర్యాదు మేరకు శువ్రారం నవాబుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ విజయ్కుమార్లె కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు
పెద్దదోర్నాల : నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య తెలిపారు. మండల కేంద్రంలోని 30 పడకల వైద్యశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని గిరిజన గూడేల్లో డయేరియా, మలేరియాతో పాటు విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గిరిజన గూడేల్లో చర్మవ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందిస్తామన్నారు. గిరిజన గూడేల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో గుర్తించి, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, డయోరియా, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి జ్వర పీడీతుల వద్ద రక్తపూత నమూనాలు సేకరించాలని స్థానిక వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెంచు గిరిజనులకు సంబంధించి ఆస్పత్రిలో గర్భిణులు వేచి ఉండే గదుల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని వైద్యాధికారులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా త్వరలో కౌన్సెలింగ్ జరగనుందని, కొందరు వైద్యులు, సిబ్బంది ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆయనతో పాటు త్రిపురాంతకం ఎస్పీహెచ్ఓ శ్రీనివాసరావు, వైద్యులు విక్టర్, డెంటల్ సర్జన్ ఉమానందిని, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఆ ఇద్దరు ఎవరు?
వీణవంక, న్యూస్‌లైన్ : వీణవంక మండలం అయిలాబాద్‌లో ఈ నెల 22న అర్ధరాత్రి హత్యకు గురైన తోటి చంద్రయ్య కేసులో ప్రధాన నిందితుడు రామిడి రాజు హైదరాబాద్‌లో శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం విదితమే. చంద్రయ్య హత్య జరిగిన రోజు ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చారని, ఒకరు బైకు మీద ఉండగా, మరో ఇద్దరు ముఖానికి ముసుగులు ధరించి హత్యలో పాల్గొన్నారని మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో ఓ వ్యక్తి కత్తితో పొడవగా, మరో వ్యక్తి లక్ష్మిపై బీరుసీసాతో దాడిచేసి పరారైనట్టు పేర్కొంది. పోలీసులు ప్రధాన నిందితుడు రాజుగా నిర్ధారించి గాలింపు చేపడుతున్న క్రమంలో అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఎవ్వరనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజు ఎవరినైనా కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి చంద్రయ్యను హత్యచేశాడా? అయితే వారు ఎక్కడివారు? ప్రస్తుతం ఎక్కడున్నారు? పోలీసులు ఈ విషయాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. రాజు సెల్‌ఫోన్‌కు ఎవరెవరు ఫోన్ చేశారో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. చంద్రయ్యను భూతగాదాలతోనే హత్య చేశారా? లేక మరేవైనా కారాణాలు ఉన్నాయా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆ ఇద్దరు దొరికితే రాజు మృతికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశముందని భావిస్తున్నారు. రాజును గుర్తించిన కుటుంబసభ్యులు రాజు హైదరాబాద్‌లో మృతి చెందాడనే సమాచారం అందుకున్న తండ్రి రా మిడి రాంనర్సయ్య, తల్లి లచ్చమ్మ, బావ రాజయ్య అక్కడికి తరలివెళ్లారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉంచిన రాజు మృతదేహాన్ని వారు గుర్తిం చినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. రాజు దేహం ముక్కలు ముక్కలుగా కాగా, శవాన్ని కరీంనగర్‌లోని తమ ఇంటికి తరలించి అంత్యక్రియలు చేశారు. కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ యాదగిరి కేసు నమోదు చేయగా, రాజుది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకుంటే రాజు శరీరం ఎందుకు ముక్కలుగా విడిపోతుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి నివేదిక పోస్టుమార్టం పైనే ఆధారపడినట్లు రైల్వే పోలీసులు ఇక్కడి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. -
రాజకీయ కుట్ర ఉంది
కోరుట్ల, న్యూస్‌లైన్ : చంద్రయ్య హత్యోదంతంలో రాజకీయ కుట్ర దాగి ఉందని, దీని కారణంగానే పోలీసులు అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పౌరహక్కుల సంఘం ప్రతినిధులు ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం ఏపీసీఎల్సీ నాయకులు చంద్ర య్య మృతి చెందిన కోరుట్ల పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఇన్చార్జి డీఎస్పీ దామెర నర్సయ్యను కలిసి చంద్రయ్య మృతి వివరాలు తెలుసుకున్నారు. ఇంటరాగేషన్ చేసిన గదితోపాటు ఠాణా రెండవ అంతస్తు పైకి ఎక్కి పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తమ పరిశీలన ప్రకారం.. ధర్మపురి, కోరుట్ల పోలీసులు కలిసి చంద్రయ్యపై చంద్రయ్యపై థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తూ రెండు రోజులుగా ఇంటరాగేషన్ చేశారన్నారు. ఈ దెబ్బలకు చనిపోయిన చంద్రయ్యను ఠాణాలో ఓ పక్కన కింద పడేసి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ చెబుతున్నారని ఆరోపించారు. చంద్రయ్య ఆత్మహత్య చేసుకుంటే సంఘటన స్థలంలో పంచనామా రికార్డు చేయాల్సి ఉండగా అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సంఘటన జరిగిన వెంటనే కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే పోలీసుల తప్పిదం తెలుస్తోందన్నారు. పోలీసు రికార్డుల్లో కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఆ రికార్డు అడిగితే పోలీసులు దాటవేయడం.. వాళ్లే చంద్రయ్యను చంపారన్న అనుమానాలకు బలాన్నిస్తోందన్నారు. చంద్రయ్య మృతి సంఘటనపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జీఈవీ.ప్రసాద్, ప్రధానకార్యదర్శి మాదం కుమార్, కోశాధికారి మహ్మద్ అక్బర్, కార్యవర్గసభ్యులు శ్రీపతి రాజగోపాల్ ఉన్నారు. -
అసలేం.. జరిగింది!
కోరుట్ల, న్యూస్‌లైన్ : ఆదివారం రాత్రి 9.30 గంటల సమయం. కోరుట్ల ఠాణాలో పోలీసుల హడావుడి. ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ మెయిన్‌గేటు మూసేశారు. పట్టణంలోని ఓ పాఠశాలలో జరిగిన దొంగతనం కేసులో పట్టుకొచ్చిన ముగ్గురు మైనర్లను విడిపించుకునేందుకు అప్పుడే వెళ్లిన వారి బంధువులను పోలీసులు బయటకు పంపించారు. వెంటనే ఠాణాలో లాకప్‌లో ఉన్న ముగ్గురు పిల్లలను వదిలేశారు. అంతలో తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని కారులో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడు ఎవరో కాదు.. సాన చంద్రయ్య. రెండు రోజులుగా ఇంటరాగేషన్ రెండు రోజులుగా చంద్రయ్యను కోరుట్ల ఠాణాలో ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఆదివా రం మధ్యాహ్నం పోలీసుల ఇంటరాగేషన్ తట్టుకోలేని చంద్రయ్య ఠాణా మొదటి అంతస్తు నుంచి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ వదలకుండా చంద్రయ్యను మళ్లీ పైఅంతస్తుకు తీసుకెళ్లి తమ తరహాలో విచారించారు. రాత్రి మరోసారి ఇంటరాగేషన్ చేశారు. ఆ దెబ్బలతో నడవలేని స్థితిలో ఉన్న చంద్రయ్యను ఠాణా రెండో అంతస్తుపైకి ఎక్కించి దెబ్బల బాధ తగ్గడానికి కాసేపు నడవమని చెప్పినట్లు సమాచారం. గుట్టుచప్పుడు కానివ్వలేదు.. చంద్రయ్య ఠాణా రెండవ అంతస్తు నుంచి కిందనున్న సిమెంట్ గచ్చుమీద పడడంతో తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు గుట్టచప్పుడు కాకుండా వ్యవహరించి ఠాణాలో ఉన్న వారిని బయటకు పంపించారు. ఠాణా సమీపంలోకి బయట వారు రాకుండా జాగ్రత్తపడ్డారు. కింద పడ్డ చంద్రయ్యను పరిశీలించి వైద్యులను పిలి పించారు. అంతలోపు చంద్రయ్యను సంఘటన స్థలం నుంచి పక్కకు జరిపి గచ్చు మీద ఏర్పడ్డ రక్తం మరకలను నీళ్లతో కడిగేశారు. చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చంద్రయ్యను అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలిసింది. ఇంత జరగుతు న్నా.. స్థానికంగా ఎవరికి ఈ విషయం తెలియలేదంటే పోలీసులు ఎంత గోప్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ చం ద్రయ్య తనకు తాను ఠాణాపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే.. పోలీసులు ఎందుకు ఇంత గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సమాధానాలేవీ.. ?
కోరుట్ల ఠాణాలో యువకుడి మృతి పోలీసు అధికారుల మెడకు చుట్టుకుంది. ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చోరీ కేసులో అనుమానితునిగా భావిస్తున్న చైర్మన్ కారు డ్రైవర్ సాన చంద్రయ్య(27) ఆదివారం రాత్రి పోలీసుల అదుపులో ఉండగానే మరణించాడు. ఇది లాకప్ డెతా? చిత్రహింసలకు తట్టుకోలేక ఠాణాపై నుంచి దూకి చనిపోయాడా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతడిని నెట్టేశారా? అనే అనుమానాలు చుట్టుముట్టడంతో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘోరాన్ని ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా వెలుగులోకి తెచ్చింది. అప్పటిదాకా గోప్యంగా ఉంచిన పోలీసు అధికారులు సోమవారం ఉదయాన్నే చంద్రయ్య మృతిచెందిన విషయాన్ని ధ్రువీకరించారు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు... కొట్టి చంపినట్లుగా మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగటం.. సీఐడీతో విచారణ జరిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయటంతో చంద్రయ్య మృతి పోలీసు విభాగంలో కలకలం రేపింది. ఈ ఘటనలో ఆద్యంతం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సందేహాస్పదంగా మిగిలిన ప్రశ్నలెన్నో...? సమాధానాలేవీ.. ? గత నెల 21న ధర్మపురిపీఏసీఎస్లో రూ.50 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ జరిగింది. పోలీసు కథనం ప్రకారం.. చంద్రయ్య సహా ముగ్గురు అనుమానితులను శనివారం అదుపులోనికి తీసుకున్నారు. వీరిని ధర్మపురిలో, సమీపంలో ఉన్న జగిత్యాలలో విచారించకుండా కోరుట్లకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? బ్యాంకులో కిలోన్నర బంగారం చోరీ జరిగితే... రెండున్నర తులాల బంగారం చంద్రయ్య నుంచి రికవరీ చేసినట్లు ఎస్పీ ప్రకటించటం ఎలుకకు ఏనుగుకు పొంతన లేనంతగానే ఉంది. మరి మిగతా బంగారం ఎక్కడుంది? నిందితులందరూ దొరికారా? బంగారం ఆచూకీ పోలీసులకు తెలిసిపోయిందా? ఆదివారం రాత్రి 9.45 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసుల కథనం. మరి కుటుంబీకులకు ఎందుకు సమాచారం అందించలేదు. మార్గమధ్యంలో జగిత్యాలలో ఆసుపత్రి సమాధానాలేవీ.. ? ఉండగా.. అర్ధరాత్రి దాటాకా కరీంనగర్ ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చింది. విచారణ జరుపుతుంటే బిల్డింగ్‌పైకి పరిగెత్తి... రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అత్యంత రహస్యంగా విచారణ చేసేందుకు అనుమానితులను.. ఎవరికి తెలియకుండా కోరుట్ల స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు బహిరంగంగా విచారణ చేశారా? పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరుగు తీశాడా? అధికారుల నిర్లక్ష్యమేమీ లేదా? నిందితులను విచారణకు తీసుకువస్తే చాలా జాగ్రత్తగా కాపలా కాస్తారు. ఒంటిపై బట్టలు, చైన్లు ఏమీ లేకుండా తొలగించి చివరకు టాయ్‌లెట్‌కు వెళ్లినా పోలీసులు అనుసరిస్తారు. కానీ.. ఇంటరాగేషన్‌లో పాటించాల్సిన కనీస జాగ్రత్తలను విస్మరించారా? సాధారణంగా బిల్డింగ్‌పై నుంచి దూకితే కాళ్లు చేతులు విరుగుతాయి. రక్తపు గాయాలుంటాయి. కానీ.. చంద్రయ్య తలకు బలమైన రక్తమైన గాయంతో పాటు చేతులు, అరికాళ్లపై కమిలిపోయిన గాయాలున్నాయి. -
కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్?
-
కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్?
కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చంద్రయ్య అనే యువకుడు పోలీసుల అదుపులో ఉండగా మరణించాడు. అతడిని పోలీసులే కొట్టి చంపారని చంద్రయ్య బంధువులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం స్టేషన్ పైనుంచి దూకి చనిపోయాడని అంటున్నారు. చంద్రయ్య కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం బుగ్గారం గ్రామవాసి. ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన చోరీ కేసులో అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా చంద్రయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులకే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రయ్య పోలీసు స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ ఎస్పీ శివకుమార్ తెలిపారు. అతడు బ్యాంకు చోరీ కేసులో నేరం ఒప్పుకున్నాడని, అతడి నుంచి తాము రెండున్నర తులాల బంగారం రికవరీ చేశామని ఆయన చెప్పారు. కేసుకు భయపడే పోలీసులను నెట్టి భవనం పైకెక్కి దూకాడని ఆయన అన్నారు. -
కాటేసిన కరెంటు
పాపన్నపేట/చేగుంట/ ఝరాసంగం,న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు సంఘటనలో కరెంట్ ముగ్గురిని బలితీసుకుంది. వరి నారుకు నీరు పార బెట్టేందుకు వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతానికి గురికాగా.. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి మరో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండలం దూమ్లా తండాకు చెందిన దరావత్ లాల్య, సాలి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న రెండెకరాల భూమిలో వరి, మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. వరి నారు ఎండిపోతుండడంతో బుధవారం సాయంత్రం నీరు పార బెట్టేందుకు పెద్ద కొడుకు ధరావత్ పీర్యా (25) తన భార్య శాంతితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అయితే భార్య పొలంలో ఓ వైపు సేద తీరింది. మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చిన త్రీ ఫేస్ కరెంట్‌తో వడి నారుకు నీరు పెట్టాడు. అయితే రోజు లాగానే సాయంత్రం 6 గంటలకు పోయింది. దీంతో తెల్లవారుజాము 3 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ రాదన్న ధీమాతో పీర్యా తన బోరుకు సంబంధించిన స్టార్టర్ డబ్బా వద్ద పాడైన కరెంట్ తీగలను మరమ్మతు చేసేందుకు పనులు ప్రారంభించాడు. అనుకోకుండా త్రీఫేస్ కరెంట్ రావడం, కాళ్ల కింద ఉన్న నీటి కారణంగా విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో మృత్యువాతపడ్డాడు. కాగా కరెంటు పోయినా భర్త రాకపోవడంతో భార్య శాంతి మోటారు బోరు వద్దకు వెళ్లి చూడగా.. నీటిపై దుస్తులు తేలియాడుతూ కనిపించాయి. ఆందోళనకు గురైన శాంతి తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పిలుచుకుని వచ్చింది. అప్పటికే పీర్యా విగతజీవుడై కనిపించాడు. చేతికొచ్చిన కుమారుడు దుర్మరణం పాలు కావడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యారు. కాగా కట్టుకున్నవాడు కళ్లముందే విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో భార్య శాంతి గుండెలు బాదుకుంది. మృతుడికి అఖిల, నందు అనే చిన్నారులు ఉన్నారు. లైన్‌మన్ ప్రాణాన్ని బలిగొన్న ఏఈ నిర్లక్ష్యం విద్యుత్‌శాఖ ఏఈ నిర్లక్ష ్యంతో లైన్ మన్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ సంఘటన చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. రామయంపేట మండలం నిజాంపేటకు చెందిన అనిల్ (28) చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా గ్రామంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్తు లైన్లను సరిచేయడానికి ఏఈ పెంట్యానాయక్ లైన్‌మన్ అనిల్‌ను తీసుకుని గ్రామానికి చేరుకున్నాడు. ఎల్సీ తీసుకోకుండానే అనుమతి లభించిందని స్తంభం ఎక్కి సరిచేయాలని లైన్‌మన్‌ను ఏఈ పురమాయించాడు. దీంతో స్తంభానికి ఎక్కిన అనిల్ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే అనిల్‌ను చికిత్స నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిల్ మృతి చెందాడని వైద్యులు తెలపారు. ఏఈ పెంట్యానాయక్ అనిల్ మృతదేహాన్ని మాసాయిపేట సబ్‌స్టేషన్‌కు తరలిస్తుండగా మృతుడి బంధువులు అడ్డుకున్నారు. అనంతరం ‘అనిల్ మృతికి నువ్వే కారణమని’ ఏఈపై దాడికి యత్నించారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ యాదగౌడ్లను రప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమాద విషయంలో ఏఈపై శాఖ పరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు ఏఈ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శాంతి భద్రతలను సీఐ గంగధర్‌తో పాటు తూప్రాన్ ఎస్ఐ నిరంజన్‌రెడ్డి, రామయంపేట ఎస్ఐ ప్రవీణ్, ట్రైనీ ఎస్ఐలు శేఖర్‌రెడ్డి, అజ్మతుల్లాలు పర్యవేక్షించారు. నాభర్తను ఏఈ వేధించేవాడు... చేగుంటకు బదిలీ అయిన రోజు నుంచి తన భర్త అనిల్‌ను ఏఈ పెంట్యానాయక్ వేధించేవాడని మృతుడి భార్య జ్యోతి రోదిస్తూ తెలిపింది. తన భర్త అనిల్ మృతికి ఏఈనే కారణమని ఆరోపించింది. మృతుడికి నాలుగేళ్ల లోపు గల కూతుళ్లు కీర్తన, సీయోనాలు ఉన్నారు. ఫ్యూజ్ వేసేందు వెళ్తూ.. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన గురువారం ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్గోయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రయ్య (60) ఎల్గోయి గ్రామంలో పిండి గిర్ణి నడుపుతూ, చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తూ ఉండేవాడు. గ్రామానికి కొత్తగా ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులపై మాట్లాడి దానిని ఏర్పాటు చేశాడు. అయితే గ్రామానికి లైన్‌మన్ లేకపోవడంతో గురువారం ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయడంతో ఫ్యూజ్‌లు బిగిస్తుండడంతో విద్యుదాఘాతానికి గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలొదిలాడు. ఇంటి నుంచి వెళ్లిన కొద్ది సేపటికే చంద్రయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించాడు. మృతుడికి భార్య నీలమ్మతో పాటు కుమారులు ప్రభు, పండరి, దత్తు, శ్రీనివాస్‌లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చంద్రయ్య మృతి చెందాడని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదన్నారు. సమాచారాన్ని అందుకున్న ట్రాన్స్‌కో డీఈఈ కరీం, ఏడీ శ్రీనివాసచారి, ఏఈ సంతోష్‌లు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించడంతో పాటు కుమారుల్లో ఒకరికి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.