సుల్తాన్‌బజార్: ప్రజా గాయకులు గద్దర్, కాకి మధవరావు, కోదండరామ్ ఒకే సామాజిక వర్గానికి కొమ్మకాస్తున్నారని వీరు మాలల ద్రోహులని మాల సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆవుల బాలనాథ్ అన్నారు. శనివారం కోఠిలోని సంఘం కార్యాలయంలో ఆగమయ్య, విజయ్‌బాబు, దాసరి భాస్కర్, మన్నేశ్రీరంగ, చెరుకు రామ్‌చందర్‌లతో కలిసి మాట్లాడారు. నిజాం లా కళాశాలలో శుక్రవారం జరిగిన సంఘటనలో మాదిగలే మాలలపై దాడి చేశారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తమ స్వార్ధం కోసమే మాల సామాజిక వర్గానికి చెందిన గద్దర్, కాకి మాధవరావు వర్గీకరణకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కాకి మాధవరావు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాలలకు చేసిందేమీ లేదని, గద్దర్ కమ్యూనిస్టు భావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొదండరామ్ వర్గీకరణకు మద్దతు పలకడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దర్, కాకిమధవరావు ఇచ్చే వినతిని స్వీకరిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహిస్తుందని వారు హెచ్చరించారు. సమావేశంలో ప్రేమ్‌కుమార్, మోహన్, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.