గర్రెపల్లి పీహెచ్‌సీ వైద్యుడి సస్పెన్షన్
Published Wed, Aug 10 2016 11:21 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాంమోహన్‌ను సస్పెండ్ చే స్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కమిషనర్ లలిత కుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పీహెచ్‌సీలో నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, గైర్హాజరు, తదితర అంశాలపై జూన్12న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన కలెక్టర్ నీతూప్రసాద్ నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో రాజేశం ఎస్పీహెచ్‌వో మారుతీరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన విచారణ జరిపి ఆరోపణలు వాస్తవాలేనని కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కమిషనర్‌కు నివేదిక సమర్పించగా.. వైద్యుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. డాక్టర్ రాజశ్రీకి ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించినట్లు ఎస్పీహెచ్‌వో మారుతీరావు తెలిపారు.
Advertisement