మాదిగ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
ఘట్‌కేసర్ టౌన్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ, మాదిగ ఉప కులాల జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయాలని మాదిగ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధారి లక్ష్మీనారాయణ, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మాదిగ జేఏసీ కార్యాలయంలో బుధవారం చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తెలుగు ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ మండల కన్వీనర్ శ్రీనివాస్, నల్లగొండ జిల్లా నాయకులు అంజయ్య, మైసయ్య, గూర్జకుంట నర్సింహ, కడుపోళ్ల మల్లేష్, నాగులపల్లి శ్రీనివాస్, నల్లగారి నర్సింహ, యాదగిరి, సుంకం గణపతి, ములుగురం పాండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
Published Wed, Aug 3 2016 5:29 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
Advertisement
Advertisement