ఎండుతున్న పంటలకు నీళ్లివ్వండి
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వండి
Published Mon, Nov 28 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
- మీకోసంలో రైతుల వినతి
కల్లూరు (రూరల్): వానలు పడక పంటలు ఎండుతున్నాయని...కర్నూలు మండలం రేమట ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లిచ్చి ఆదుకోవాలని రైతులు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, మునిస్వామి, రాజశేఖర్..జేసీ హరికిరణ్‌ను కోరారు. ఐదుసార్లు అర్జీలిచ్చినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలులోని సునయన ఆడిటోరియంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ, జేసీ-2 రామస్వామి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్..తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ‘మీకోసం’కు వచ్చిన వినతుల్లో కొన్ని...
- కౌలుక్చిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించి..ఇదిమిటని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల పెద్ద పుల్లన్న, లచ్చమ్మ ఫిర్యాదు చేశారు.
- కర్నూలు మండలం నూతనపల్లె గ్రామంలోని వంతెన పక్కన పోరంబోకు స్థలంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కడుతున్న కాంపౌండ్ వాల్‌ను అడ్డుకున్నామని.. ఇలా చేస్తే బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామ పెద్దలు బాలస్వామి, రోశప్ప, మాసుంమియ్యా, మెహబూబ్.. జడ్పీ సీఈఓ ఈశ్వర్‌కు తెలిపారు. ఆయన స్పందిస్తూ.. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు తహసీల్దార్ రమేష్‌బాబును ఆదేశించారు.
చంపేస్తామంటున్నారు..(28కెఎన్‌ఎల్15ఏ: జేసీకి ఫిర్యాదు చేసిన పెరుమాళ్ల పెద్దపుల్లన్న, లచ్చమ్మ)
– కల్లూరులోని సర్వే నెంబర్లు 195సి, 195బిలోని 2.56 సెంట్ల తమ భూమిని సంపతి వీరారెడ్డి కుమారుడు సంపతి లక్ష్మీరెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని మహమ్మద్ యాఖుబ్, అబ్దుల్ గఫార్, డీఎస్ అహ్మద్... జేసీకి ఫిర్యాదు చేశారు.
కొడుకు ఇంటి నుంచి గెంటేశాడు..
- మిడ్తూరు మండలం పైపాలెంలో 95 సెంట్ల భూమిని, అలాగే తన మూడున్నర తులాల బంగారాన్ని, రూ.1,50,000 నగదును తన చిన్నకుమారుడు రామచంద్రుడు తీసుకొని తనను ఇంటి నుంచి గెంటేశాడని.. బోయ లచ్చమ్మ కన్నీటి పర్యంతమైంది. భర్త తిరుపాలు చనిపోవడంతో తనకు దిక్కు ఎవరూ లేరని.. పెద్దకుమారుడు రామకృష్ణ ఇంటి పక్కన ఉన్న పశువుల పాకలో తలదాచుకుంటున్నానని జేసీ2 రామస్వామి దృష్టికి తీసుకొచ్చింది. గ్రామంలో ఎవరైనా దయదలచి ముద్ద అన్నం పెడితే తింటున్నానని లేదంటే పస్తులుండాల్సి వస్తోందని..న్యాయం చేయాలని ఆమె కోరారు.
– బ్రాహ్మణ పేద పిల్లల కోసం బ్రాహ్మణ భవన్‌కు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ కర్నూలు నగర పాలక సంస్థ కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కె మనోహర్, జిల్లా కార్యదర్శి హెచ్‌కె రాజశేఖర్ జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్‌కు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
– ఐసీడీఎస్‌లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు. పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేయకుండా ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్ వారు అనుభవం అడుగుతున్నారని...ఎన్‌జీఓలకు డబ్బులిచ్చి సర్టిఫికెట్ తెచ్చుకున్న వారికే అవకాశం కల్పిస్తే అవినీతికి మార్గం చూపినట్లు అవుతుందని.. చైతన్య, శిరీష జేసీకి విన్నవించారు.
– శిరువెళ్ల మండలం వెంకటాపురం గ్రామంలోని హిందూ శ్మశాన వాటిక లేదని, సర్వే నెంబర్లు 114/1బి, 102/1బిలోని 2.50 సెంట్ల పిడబ్ల్యూడీ పోరంబోకు భూమిని ఇందుకు స్థలం కేటాయించాలని కాటికాపరి కొప్పెర దేవరాజు జేసీకి విన్నవించారు.
Advertisement