వెయ్యి కోట్లతో గోదాములు
నిజామాబాద్ కల్చరల్/నిజామాబాద్‌క్రైం :
రాష్ట్రంలో ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో గోదాములు నిర్మిస్తోందని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆమె సోమవారం నిజామాబాద్ మండలంలోని నర్సింగ్‌పల్లిలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రద్ధానంద్‌గంజ్‌లో నిర్వహించిన నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో గోదాంల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసిందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంప శ్రీనివాస్‌గుప్తా, ప్రధాన కార్యదర్శిగా కమల్ కిషోర్ ఇన్నాని, కోశాధికారిగా సిర్ప రాజేశ్వర్ ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర లభించే వరకు గోదాముల్లో నిల్వ ఉంచుకునేందుకు గోదాముల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పంటను మార్కెట్‌లోనే అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్‌లో 4 వేల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. బైపాస్ రోడ్డును శ్రద్ధానంద్ గంజ్ పక్కన గల స్థలం నుంచి అనుసంధానం చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆవరణలో ఎంపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్‌ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు చాంగుబాయి, విశాలినిరెడ్డి, ఎనుగందుల మురళి, పంచరెడ్డి సురేశ్, మర్చంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షుడు కరిపె సత్యం, అర్వపల్లి పురుషోత్తం, బచ్చు పురుషోత్తం, మార్కెట్‌కమిటీ సెక్రెటరీ సంగయ్య తదితరులు పాల్గొన్నారు.
వివరాలు 16లో..