భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎంఎల్‌ఏ
-
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-
ప్రజాధనాన్ని వృథా చేయొద్దని హితవు
ముత్తారం : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. మండలంలోని లక్కారంలో ఉపా«ధిహామి నిధులు రూ.13లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ. 8 లక్షలతో అంగన్‌వాడీ భవనం, ఖాజీపల్లి రూ.8 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం కాకుండా చూడాలని ఆయన కోరారు. ప్రజల నుండి పన్నుల రూపంలో వసూళ్లు చేసిన డబ్బులనే ప్రభుత్వం అభివృద్ధి పనులకు వెచ్చిస్తోందని అలాంటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన అన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన శ్రీకోదండరామాలయం నిర్మాణం పూర్తిచేయించాలని స్థానికులు కోరగా ఆలయ నిర్మాణం పూర్తిచేయించడం తనవల్ల కాదని నిర్మాణానికి తనవంతు సాయం అందిస్తానని హామిఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తెచంద్రమౌళి, మండల కోఆప్షన్ సభ్యుడు సలీంసత్తార్, సర్పంచ్‌లు అగ్గిమల్ల సతీష్, చెల్కల అశోక్, నూనె కుమార్, ఉపసర్పంచ్ బర్ల శ్రీలత, మాజీ ఎంపీటీసీ రొడ్డ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్డు సభ్యుల అలక..
లక్కారం, ఖాజీపల్లిలో ఆదివారం నిర్వహించిన పలు శంకుస్థాపన శిలాఫలకాల్లో తమపేర్లు ముద్రించలేదని వార్డుసభ్యులు అలకభూనారు. కనీసం పంచాయతీ భవన నిర్మాణం శిలాఫలకంలోనైనా తమపేర్లు ముద్రించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. పంచాయతీ భవనం ప్రారంభం సమయంలో ఏర్పాటు చేసే శిలాఫలకంలో వార్డు సభ్యులందరి పేర్లు ముద్రించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ అత్తె చంద్రమౌళి హామీ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. దీంతో శంకుస్థాపన కార్యక్రమానికి వార్డుసభ్యులు దూరంగా ఉన్నారు.
ఉచిత వైద్యశిబిరం ప్రారంభం
ఓడేడ్‌లో దివంగత మాజీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు పోతుపెద్ది రాంచెంద్రారెడ్డి స్మారకార్థం ఏర్పాటుచేసిన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంబించారు. గ్రామంలోని నిరుపేదలకు రాంచెంద్రారెడ్డి వైద్యపరంగా ఏన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి యేడాది గ్రామస్తుల కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన సంవత్సరీకం సందర్భంగా వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్యశిబిరం నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇల్లెందుల అశోక్‌గౌడ్, ఎంపీటీసీ పోతుపెద్ది కవిత, మాజీ సర్పంచ్ పోతుపెద్ది కిషన్‌రెడ్డి, నాయకులు అల్లాడి యాదగిరిరావు, పూదరి మహేందర్, శీలం తిరుపతి, కోటగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.