Published
Sat, Sep 10 2016 8:03 PM
| Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం
మోటకొండూర్(యాదగిరిగుట్ట): టీఆర్‌ఎస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలను విస్మరిస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. మండలంలోని మోటకొండూర్‌లో శనివారం గణే శ్ నవరాత్రుల్లో భాగంగా మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా రైతులకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందలేదని, రెండవ విడత రుణమాఫీ సైతం ఇవ్వలేదన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రుణాలు ఇచ్చేలా టీఆర్‌ఎస్ సర్కార్‌కు బుద్ధి ప్రసాదించాలని గణేశుడికి పూజలు చేసినట్లు భిక్షమయ్యగౌడ్ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీర్ల అయిలయ్య, ఎంపీటీసీ బుగ్గ పర్వతాలు, గడ్డం అంజయ్య, కుండె శ్రీశైలం, బండి కుమార్, తోటకూరి బీరయ్య, భూమండ్ల శ్రీను, కానుగు బాలరాజు, బుగ్గ శ్రీశైలం తదితరులున్నారు.