పోలీస్ పహారాలో మోటకొండూర్
యాదగిరిగుట్ట : ప్రతిపాదిత మోటకొండూర్‌ను మండలంగా ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను శనివార ం అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షలను పోలీసులు భగ్నం చేసి, ఆందోళనకారులను సంస్థనారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో మోటకొండూర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం వరంగల్ జిల్లా వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను అడ్డుకుంటారని ముందస్తుగా మాచారంతో వంగపల్లి నుంచి బాహుపేట వరకు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. జాతీయ రహదారిపైకి ఎవరూ వెళ్లకుండా జాగ్రతలు తీసుకున్నారు.
జాతీయ రహదారిపై ధర్నా...
అక్రమ అరెస్టులను నిరసిస్తూ వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మోటకొండూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.