వ్యవసాయ రంగంపై సర్కార్ నిర్లక్ష్యం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ధ్వజం
హుజూర్‌నగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని 10 జిల్లాల్లో 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 107 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడాదికి 20 నుంచి 25 శాతం చొప్పున ఆహార ఉత్పత్తులు తగ్గిపోతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను 49 లక్షల టన్నులకు పడిపోయాయన్నారు. రాష్ట్రంలో ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇదే మాదిరిగా 20 నుంచి 25 శాతం ప్రతి ఏడాది తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.