కార్పొరేషన్‌ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం | govt neglegence in corporation loans | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Published Sun, Aug 7 2016 10:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కార్పొరేషన్‌ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం - Sakshi

కార్పొరేషన్‌ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం

మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌

ధారూరు: బీసీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్‌ రుణాలు అందలేదని, వీటిపై కలెక్టర్‌ స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ధారూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు నెలల కిందట నిరుద్యోగులు కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తులు చేసుకోగా ఎంపికైన లబ్ధిదారులకు ఇంతవరకు మంజూరు కాలేదని తెలిపారు. యూనిట్ల గ్రౌండింగ్‌కు కలెక్టరేట్‌, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఖాతాల్లో రుణాలు జమ కాలేదని వాపోయారు. లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేస్తారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవసరమైన నిధులు జమచేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్‌ రుణాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో గారడీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంగమేశ్వర్‌రావు, గట్టెపల్లి సర్పంచ్‌ పాండునాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు చెక్క వీరన్న, నారాయణ్‌రెడ్డి, చాకలి నర్సింహులు, యువజన కాంగ్రెస్‌ నాయకులు కిరణ్‌కుమార్‌, కుమ్మరి రాము, శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement