పోలీస్ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు
ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం
క్షణాల్లో నేరప్రాంతానికి పోలీస్‌ల చేరిక
మొదట సుమోలకు.. రెండో విడతలో బైక్‌లకు..
నల్లగొండ రూరల్ : ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ముందుకు సాగుతోంది. క్షణాల్లో నేర ప్రాంతానికి చేరేలా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేలా.. నిందితుల ఆట కట్టించేలా.. రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తన ప్రత్యేక మార్క్‌తో పోలీస్ వాహనాలకు సాంకేతికతను జోడిస్తున్నారు. జిల్లాలో ఏప్రాంతంలోనైనా నేర సంఘటనలు జరిగితే.. సిబ్బంది అక్కడికి క్షణాల్లో చేరేలా పోలీస్ (సుమో) వాహనాలకు గ్లోబల్ పొ జిషన్ సిస్టం (జీపీఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూంకు వాటిని అ నుసంధానం చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా ఏ పోలీస్‌వాహనం ఎక్కడుంది.. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం సమీపంలో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరేలా పు రమాయించి.. నేరస్తుల ఆటకట్టించవచ్చు. జిల్లాలో 30 పోలీ స్ వా హనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 20 వాహనాలకు పూర్తయిం దని.. ఒక్కో పరికరానికి రూ.10 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రయోజనం ఇలా..
ఏదైనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, హత్య, ధర్నా, సరుకులు, ఇసుక అక్రమ రవాణాతోపాటు ప్రజలకు ఇబ్బంది కల్గించే ఏ సంఘటనపైనా పోలీసులకు సమాచారం అందితే చాలు.. జీపీఎస్ ఏర్పాటుతో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడికి క్షణాల్లో చేరే అవకాశం ఉంది. ఉదాహరణకు హత్య లేదా రోడ్డు ప్రమాదం జరిగితే...అక్కడికి చేరుకున్న పోలీసులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి జీపీఎస్‌కు లింక్ చేస్తారు (ఒక నంబర్‌ను ప్రెస్ చేస్తారు). సంఘటన స్థలంలో ఏం జరిగిందో ఈ ఫొటో ద్వారా ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు స్పష్టంగా తెలుస్తుంది. అత్యవసర సందర్భాల్లో అదనపు బలగాలను సైతం సంఘటన ప్రాంతానికి త్వరగా పంపించవచ్చు. అంతేకాదు.. పోలీస్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని అధికారులు పట్టేయవచ్చు. భాభాగంపై పోలీసు వాహనం ఎక్కడ ఉంది.. అందులో ఎంత మంది పోలీసులు ఉన్నారు.. సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఆలస్యమైన పక్షంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏపాటిదో అధికారులు ఇట్టే గ్రహించవచ్చు.
రెండో దశలో బైక్‌లకు..
మొదటి దశలో పోలీస్ సుమోలకు జీపీఎస్ ఏర్పాటు అనంత రం పోలీసులు ఉపయోగించే బైక్‌లకు ఈ పరికరాన్ని అమర్చనున్నారు. బైక్‌లకు ’రియల్ టైమ్ వెకిల్ ట్రాకిన్’ పరికరం అమర్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీని ద్వారా ట్రాఫిక్, సి విల్ బైక్‌లు ఏ ప్రాంతంలో ఉన్నాయి.. అనేది ఇట్టే తెలిసిపోతుంది.
జీపీఎస్
Published Tue, Dec 13 2016 2:24 AM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
Advertisement