GPRS
-
అరచేతిలో పంచాయతీ సమాచారం! మళ్ళీ కొత్త హంగులతో..
ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే యాప్ ద్వారా పరిశీలించవచ్చు. పంచాయతీలకు సంబంధించిన పద్దుల వివరాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ యాప్‌ను 2019 లోనే రూపొందించగా కొన్ని కారణాలతో వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్.. గ్రామపంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని సైతం యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏ దశల్లో ఉన్నాయనే సమాచం యాప్‌లో దర్శనమిస్తుంది. జిల్లా - పంచాయతీలు ► ఆదిలాబాద్ - 467 ► నిర్మల్ - 396 ► మంచిర్యాల - 311 ► ఆసిఫాబాద్ - 335 పారదర్శకతకు ప్రాధాన్యం.. పంచాయతీ నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది ప్రజలు సులువుగా తెలుసుకోవచ్చు. గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. పద్దుల వివరాలు ప్రజల వద్దకు వెళ్లడంతో పాలకవర్గాలు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలు ప్రశ్నించవచ్చు. పంచాయతీ వివరాలు ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్‌కు వెళ్లి ‘మేరీ పంచాయతీ’ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ వివరాలు దర్శనమిస్తాయి. వాటిని నమోదు చేయగానే గ్రామపంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు లేదా పిన్‌కోడ్‌తో సైతం సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకోవచ్చు. సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.. గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలను నెలకోసారి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షిప్తపరుస్తారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపు, పనుల వివరాల్లో సందేహాలు ఉంటే గ్రామసభల్లో ప్రశ్నించవచ్చు. – అరుణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ముమ్మరంగా డీజీపీఎస్ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా భూములు రీ సర్వే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) చేపట్టిన సర్వే విజయవంతమైంది. ఆరు గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ప్రైవేట్ ఏజెన్సీలు డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నాయి. త్వరలో నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సర్వే చేపట్టనున్నారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా శాటిలైట్ల నుంచి వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. కానీ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా పనిచేసే రోవర్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో ఇటువంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 2,800 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను డీజీపీఎస్ ద్వారా సర్వే చేయనున్నారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య ఎక్కువగా ఉండడంతో అక్కడే ఎక్కువ దృష్టి పెట్టారు. మొత్తం 2,800 గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి డీజీపీఎస్ సర్వేకు టెండర్లు పిలిచారు. తొలి ప్యాకేజీని గతంలోనే ఖరారు చేసి ఐదు ఏజెన్సీలకు పనులు అప్పగించడంతో సర్వే ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన మూడు ప్యాకేజీల టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. త్వరలో అక్కడ కూడా సర్వే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జీపీఎస్
పోలీస్ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం క్షణాల్లో నేరప్రాంతానికి పోలీస్‌ల చేరిక మొదట సుమోలకు.. రెండో విడతలో బైక్‌లకు.. నల్లగొండ రూరల్ : ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ముందుకు సాగుతోంది. క్షణాల్లో నేర ప్రాంతానికి చేరేలా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేలా.. నిందితుల ఆట కట్టించేలా.. రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తన ప్రత్యేక మార్క్‌తో పోలీస్ వాహనాలకు సాంకేతికతను జోడిస్తున్నారు. జిల్లాలో ఏప్రాంతంలోనైనా నేర సంఘటనలు జరిగితే.. సిబ్బంది అక్కడికి క్షణాల్లో చేరేలా పోలీస్ (సుమో) వాహనాలకు గ్లోబల్ పొ జిషన్ సిస్టం (జీపీఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూంకు వాటిని అ నుసంధానం చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా ఏ పోలీస్‌వాహనం ఎక్కడుంది.. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం సమీపంలో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరేలా పు రమాయించి.. నేరస్తుల ఆటకట్టించవచ్చు. జిల్లాలో 30 పోలీ స్ వా హనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 20 వాహనాలకు పూర్తయిం దని.. ఒక్కో పరికరానికి రూ.10 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయోజనం ఇలా.. ఏదైనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, హత్య, ధర్నా, సరుకులు, ఇసుక అక్రమ రవాణాతోపాటు ప్రజలకు ఇబ్బంది కల్గించే ఏ సంఘటనపైనా పోలీసులకు సమాచారం అందితే చాలు.. జీపీఎస్ ఏర్పాటుతో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడికి క్షణాల్లో చేరే అవకాశం ఉంది. ఉదాహరణకు హత్య లేదా రోడ్డు ప్రమాదం జరిగితే...అక్కడికి చేరుకున్న పోలీసులు సెల్ఫోన్లో ఫొటోలు తీసి జీపీఎస్‌కు లింక్ చేస్తారు (ఒక నంబర్‌ను ప్రెస్ చేస్తారు). సంఘటన స్థలంలో ఏం జరిగిందో ఈ ఫొటో ద్వారా ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు స్పష్టంగా తెలుస్తుంది. అత్యవసర సందర్భాల్లో అదనపు బలగాలను సైతం సంఘటన ప్రాంతానికి త్వరగా పంపించవచ్చు. అంతేకాదు.. పోలీస్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని అధికారులు పట్టేయవచ్చు. భాభాగంపై పోలీసు వాహనం ఎక్కడ ఉంది.. అందులో ఎంత మంది పోలీసులు ఉన్నారు.. సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఆలస్యమైన పక్షంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏపాటిదో అధికారులు ఇట్టే గ్రహించవచ్చు. రెండో దశలో బైక్‌లకు.. మొదటి దశలో పోలీస్ సుమోలకు జీపీఎస్ ఏర్పాటు అనంత రం పోలీసులు ఉపయోగించే బైక్‌లకు ఈ పరికరాన్ని అమర్చనున్నారు. బైక్‌లకు ’రియల్ టైమ్ వెకిల్ ట్రాకిన్’ పరికరం అమర్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీని ద్వారా ట్రాఫిక్, సి విల్ బైక్‌లు ఏ ప్రాంతంలో ఉన్నాయి.. అనేది ఇట్టే తెలిసిపోతుంది. -
త్వరలో ‘నిర్భయ’ స్కూటర్
ముంబై: ముంబై: మరో రెండు నెలల్లో నిర్భయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. మహిళల భద్రత కోసం ఇన్-బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్(జీపీఆర్ఎస్ ఎనేబుల్ ట్రాకింగ్ సిస్టమ్) ఉండడం ఈ స్కూటర్ ప్రత్యేకత. మొబైల్ ఫోన్ల ద్వారా ఈ స్కూటర్‌ను ఒక యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చని మోరెల్లో యమసకి సీఈఓ రజిత్ ఆర్. ఆర్య పేర్కొన్నారు. ఈ స్కూటర్‌కు ఉన్న ఒక బటన్‌ను నొక్కితే, సదరు స్కూటర్ ఎక్కడ ఉన్నదన్న సమాచారాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలుస్తుందని, ప్రతీ 2/3 నిమిషాలకు ఈ సమాచారం ట్రాన్స్మిట్ అవుతుందని వివరించారు. ఈ స్కూటర్ ధర రూ.35,000 ఉండొచ్చని, మహిళా కొనుగోలుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వాలని యోచిస్తున్నామని వివరించారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిమీ. అని, దీనికి డ్రైవింగ్ లెసైన్స్ అవసరం లేదని వివరించారు. త్వరలో హైస్పీడ్ స్కూటర్లు ఈ తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరో రెండు నెలల్లో మార్కెట్లోకి తెస్తామని రజిత్ ఆర్. ఆర్య వెల్లడించారు. ముంబైకు చెందిన ఆర్య గ్రూప్, జపాన్‌కు చెందిన యమసకి మోటార్స్ కలసి మోరెల్లో యమసకి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. తక్కువ వేగంతో నడిచే మూడు స్కూటర్లను ప్రస్తుతం ఈ కంపెనీ విక్రయిస్తోంది. త్వరలో హై-స్పీడ్ స్కూటర్లనందిస్తామని ఆర్య వివరించారు. -
త్రినేత్రం
వాహనాల కదలికలపై పోలీసుల దృష్టి జీపీఆర్ఎస్తో అనుసంధానం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రయాణికుల భద్రత దిశగా మార్పులు అన్ని క్యాబ్‌లకు ఒకే రంగు ఆర్టీఏ, పోలీసు విభాగాల సన్నాహాలు స్వాతి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగి. విధులు ముగించుకొని వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్లోకి ఎక్కింది. అందులో కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆమె ఓ నెంబర్‌కు ఫోన్ చేసింది. క్షణాల్లో క్యాబ్ ముందు పోలీస్ జీపు ఆగింది. ఆకతాయిల ఆగడాలకు బ్రేక్ పడింది. ఇదేదో కథ కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో నగరంలో పోలీసుల నుంచి ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్యాబ్‌లను ఆశ్రయించే ప్రయాణికులు, ముఖ్యంగా యువతులు, మహిళలు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు అవకాశం కలుగనుంది. సాక్షి, సిటీ బ్యూరో: ప్రయాణికులకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా తిరిగే క్యాబ్‌ల కదలికలను నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఆర్టీఏ, పోలీసు విభాగాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించేందుకు అనువైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల క్యాబ్‌లను జీపీఆర్ ఎస్తో అనుసంధానం చేయనున్నారు. వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు. క్యాబ్‌లపైన 24 గంటల పాటు నిఘా ఉండేవిధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులు, ఐటీ కారిడార్లలో పని చేసే సాఫ్ట్వేర్ నిపుణులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల క్యాబ్‌లను ఒకే విధమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేవిధంగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని క్యాబ్ సంస్థలు సొంతంగా ఇలాంటి జీపీఆర్ఎస్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. మరి కొన్ని క్యాబ్‌లు కాల్ సెంటర్ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇలాంటి అన్ని రకాల క్యాబ్‌లను ఇక పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించే విధంగా సరికొత్త జీపీఆర్ఎస్తో లింక్ పెడతారు. గ్రేటర్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే క్యాబ్‌లతో పాటు, హైటెక్ సిటీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థలకు తిరిగే క్యాబ్‌లు, సాధారణ క్యాబ్‌లన్నీ కలిపి సుమారు 25 వేల వరకు ఉంటాయి. వీటన్నింటినీ జీపీఆర్ఎస్తో అనుసంధానిస్తారు. వచ్చే ఆగస్టు నాటికి 1000 సిటీ బస్సులను జీపీఆర్ఎస్తో అనుసంధానం చేసే వ్యవస్థకు ఆర్టీసీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మరోవైపు క్యాబ్‌లను కూడా ఇలాంటి వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు రవాణా, పోలీసు విభాగాలు తాజాగా సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణికుల రవాణాకు వినియోగించే అన్ని రకాల వాహనాలను దశల వారీగా ఇలాంటి నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. అన్ని క్యాబ్‌లు తెలుపు రంగులోకి... ప్రయాణికులు తేలిగ్గా గుర్తించేవిధంగా క్యాబ్‌ల రంగులను కూడా పూర్తిగా మార్చి వేయనున్నారు. ప్రస్తుతం క్యాబ్ సంస్థలు తమకు నచ్చిన రంగులలో వాహనాలను నడుపుతున్నాయి. ఇక నుంచి అలా కాకుండా అన్నిటినీ తెలుపు రంగులోకి మార్చి, నీలి రంగు పట్టీని (బ్లూ బ్యాండ్) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులే కాకుండా పోలీసులు, రవాణా అధికారులు కూడా తేలిగ్గా గుర్తించే విధంగా వాహనం పైన ‘ట్యాక్సీ క్యాబ్’ అని పెద్ద అక్షరాలతో బోర్డును ఏర్పాటు చేస్తారు. డోర్లపైన కూడా ‘ట్యాక్సీ క్యాబ్’ అని రాస్తారు. డ్రైవర్లు తెలుపు రంగు యూనిఫామ్ ధరిస్తారు. ఇందుకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఆర్టీఏ అధికారి చెప్పారు. నిర్వహణ సంస్థలకు భారం ఆర్టీఏ, పోలీసు విభాగాలు అనుకున్నట్లుగా క్యాబ్‌లను జీపీఆర్ఎస్తో అనుసంధానిస్తే వాటి సంస్థలపైన పెద్ద ఎత్తున నిర్వహణ భారం పడే అవకాశం ఉంది. ఒక్కో వాహనంలో జీపీఆర్ఎస్ పరికరాలను అమర్చుకోవాలంటే రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. పైగా వాహ నాల రంగును కూడా పూర్తిగా మార్చవలసి ఉంటుంది. ఈ సరికొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.