
కిశోర్‌కు ఆర్థిక సాయం అందిస్తున్న నేతలు, ప్రజలు
పాలకొండ రూరల్: పాలకొండ పట్టణానికి చెందిన కలిశెట్టి కిశోర్‌కు దాతలు బాసటగా నిలుస్తున్నారు. ‘హృదయ ‘వేదన’ శీర్షికన కిశోర్ జీవితంపై ప్రచురితమైన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఒక్క రోజులో దాదాపు రూ.30 వేల వరకు ఆర్థిక సాయం అందించేందుకు హామీలు ఇచ్చారని, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయని కిశోర్ తెలిపాడు.
నేతల పరామర్శ
దాతలతో పాటు నేతలు కూడా రాజకీయాలకు అతీతంగా కిశోర్ విషయంలో స్పందిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కొందరు ఆర్థిక సాయం అందించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత చందక జగదీష్‌కుమార్, టీడీపీ నేత వంజరాపు ఈశ్వరరావు, బీజేపి నేత టంకాల దుర్గారావు, లోక్‌సత్తా నేత పొట్నూరు వైకుంఠరావుతోపాటు పలువురు స్థానికులు కిశోర్‌కు చేయూత అందించారు.