నల్లగొండ: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భూదాన్‌పోచంపల్లి వద్ద మూసీ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపైకి నీరు చేరుకోవటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పత్తి, కంది చేలు జలమయమయ్యాయి.