ఆదిలాబాద్ : జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో కడెం ప్రాజెక్ట్ నిండు కుండగా మారింది. ప్రాజెక్టులోని 5 గేట్లను అధికారులు ఎత్తివేసి... నీటిని కిందకి వదిలారు. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 64,440 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 59,550 క్యూసెక్కులు ఉంది. నిర్మల్ వద్ద కనకాపూర్ వాగు పొంగిపొర్లుతుంది. దీంతో నిర్మల్ - మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేశారు. అలాగే నిర్మల్ పట్టణంలో పిడుగుపడి ఇల్లు ధ్వంసమైంది.