యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు బయట బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం తీసుకుంటోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.