యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ | Heavy rush in Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Apr 10 2016 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

Heavy rush in Yadadri

యాదగిరిగుట్ట (నల్లగొండ) : పరీక్షల సమయం ముగియడంతోపాటు వరుస సెలవులు రావడంతో.. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. యదాద్రి పై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

స్వామివారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులను గుట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement