రేణిగుంట విమానాశ్రయం
తిరుపతి ఎయిర్‌పోర్టులో భద్రత పెంపు
Published Sat, Jul 30 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
– ఎఫ్‌ఆర్‌వోగా తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి
– ప్రయాణికులు వెళ్లే, వచ్చే ద్వారాల్లో తనిఖీలు ముమ్మరం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో భద్రతను పెంచనున్నారు. ఇందు కోసం ఎయిర్‌పోర్టు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ఆథరైజ్డ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుగా (ఐసీపీ) రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ జీవో ఎంఎస్ నెంబరు 92 ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 26న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎయిర్‌పోర్టు భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అర్బన్ ఎస్పీ ఆర్ జయలక్ష్మిని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌వో)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు లోకి వెళ్లే్ల, బయటకు వచ్చే ద్వారాల్లో ప్రత్యేక తనిఖీలు చేస్తారు. ఇందుకోసం ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎసై ్సలు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంపిక చేసి వీరికి హైదరాబాద్, విశాఖ ఎయిర్‌పోర్టుల్లో శిక్షణ ఇప్పించారు.
Advertisement