ఏం అభివృద్ధి చేశారని ఆ పార్టీలో చేరాలి? | i am not joining in tdp : mla rk roja | Sakshi
Sakshi News home page

ఏం అభివృద్ధి చేశారని ఆ పార్టీలో చేరాలి?

Published Sun, Aug 14 2016 10:01 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

ఏం అభివృద్ధి చేశారని ఆ పార్టీలో చేరాలి? - Sakshi

ఏం అభివృద్ధి చేశారని ఆ పార్టీలో చేరాలి?

- ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
సాక్షి, తిరుమల: తిరుమల వెంకన్న సాక్షిగా వేయికాళ్ల మండపం కూల్చేసిన చంద్రబాబుకు అప్పట్లో తగిన శాస్త్రి జరిగిందని, అయినప్పటికీ విజయవాడలో 30 గుళ్లు కూల్చేసి ఆ విగ్రహాలు ముక్కలు చేసి లారీల్లో తరలించటం అపచారమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆవేదన  వ్యక్తం చే శారు. దేవుడి విగ్రహాలను ముక్కలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, పార్టీని కూడా ఆ దేవుళ్లే ముక్కలు చేయటం  ఖాయమన్నారు. తాను తెలుదేశం పార్టీలో చేరతాననటం హాస్యాస్పదమని, ఆ పార్టీ మైండ్‌గేమ్ ఆడుతూ , వారి అనుకూల  మీడియాలో దుష్ర్పచారం చేస్తోందని విలేకరులు అడిన ప్రశ్నకు బదులిచ్చారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని ఆపార్టీలో చేరాలి అని ఆమె ప్రశ్నించారు. గోదావరితోపాటు కృష్ణా పుష్కరాల్లో  ప్రభుత్వమే దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కేవలం  లైట్లు, కలర్‌తో నింపి పుష్కరాల్లో పూర్తిగా అవినీతికి పాల్పడిందన్నారు. పుష్కర స్కానాలకు మంచినీళ్లు ఇవ్వలేక, బురదనీళ్లే ఇవ్వటం ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. ఇలాంటి ప్రభుత్వం సామాన్య జనానికి ఏం మేలు చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement