మాట్లాడుతున్న జేసీ దివ్య
-
మేయర్, కార్పొరేటర్లతో జేసీ సమీక్ష
ఖమ్మం:
ఖమ్మంలోని పేద ప్రజలందరికీ దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని జాయింట్ కలెక్టర్ దివ్య తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి జాబితా సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. ప్రజ్ఞాహాల్‌లో మేయర్ పాపాలాల్, కార్పొరేటర్లతో దీపం పథకంపై శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అర్హులను గుర్తించాల్సిందిగా కార్పొరేటర్లకు సూచించారు. కేవలం రూ.1,902 కే గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తామన్నారు. అర్హుల ఎంపికలో అలసత్వం వద్దని మేయర్ పాపాలాల్ కోరారు. పేదలందరికీ గ్యాస్ కనెక్షన్ అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, డిప్యూటీ తహశీల్దార్ సునీల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.