చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం | important to the understanding of the laws | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం

Published Fri, Mar 10 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం

చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం

ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇది సాధ్యం
కామారెడ్డి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎండీ అబ్దుల్‌ సలీం
సమాచార హక్కు చట్టంపై  విద్యార్థులకు అవగాహన


భీమ్‌గల్‌(బాల్కొండ) : చట్టాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రజల్లో చైతన్యం రావడం ద్వారానే చట్టాలపై అవగాహన కలుగుతుంద ని సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్, కామారెడ్డి జ్యుడీషియల్‌ మెజిస్త్రేట్‌ ఎండీ అబ్దుల్‌ సలీం అన్నారు. గురువారం ఆయన భీమ్‌గల్‌లోని ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. చట్టమనేది ఎవరికీ చుట్టం కాదన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు వివిధ చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. గృహ హింస, నిర్భయ, వరకట్న వేధింపులు, బాలకార్మిక హక్కు చట్టం, విద్యా హక్కు చట్టాలతో పాటు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం రాకముందు ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు సమాచారం లభించేదికాదన్నారు. ఇప్పుడు ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా సమాచారం పొం దే వీలుందన్నారు.

దీని ద్వారా అవినీతిని బట్టబయ లు చేయవచ్చన్నారు. ఈ చట్టం వచ్చాకే రూ. 1.86 లక్షల కోట్ల టూజీ స్పెక్ట్రం కుంభకోణం వెలుగుచూసిందన్నా రు. ఢిల్లీలో 2008–09లో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌ రూ. 86 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఈ చట్టం ద్వారానే బయటపడిందన్నారు. ఇలా ఎన్నో అక్రమా లు వెలుగు చూశాయన్నారు. విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా సమాజంలో పేరుకుపోయిన అవినీతిని వెలికితీయవచ్చన్నారు. సమావేశంలో ఆర్టీఐ కామారెడ్డి జిల్లా స్పోక్స్‌ పర్సన్, న్యాయవాది ఏక శ్రీనివాస్‌రావ్, న్యా యవాది టి.లక్ష్మీనర్సింహాచారి, కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొనకంటి నర్సయ్య, సర్పంచ్‌ గుగులోత్‌ రవినాయక్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ గంగేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు ఎంఏ మోయిజ్, బాలకిషన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement