శిశువును వదిలేసిన మహిళ | infant fond in hospital | Sakshi
Sakshi News home page

శిశువును వదిలేసిన మహిళ

Published Wed, Jul 27 2016 7:30 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

శిశువును వదిలేసిన మహిళ

శిశువును వదిలేసిన మహిళ

తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఘటన 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
చైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కు అప్పగించిన పోలీసులు
 
తెనాలి రూరల్‌ : కన్న బిడ్డ ఆ తల్లికి భారమయ్యాడో లేక ఆమెకు ఏం కష్టమొచ్చిందోగానీ నాలుగు నెలల పసి కందును వైద్యశాలలో వదిలి వెళ్లిపోయింది. ఆరోగ్యంగానే ఉన్న ఆ శిశువు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీ రాత్రి గుర్తు తెలియని మహిళ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు శిశువుతో కలిసి వచ్చింది. చాలా సేపు అక్కడే తిరుగాడిన ఆమె అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా శిశువును వైద్యశాలలో వదిలిపెట్టి వెళ్లిపోయింది.

శిశువును గమనించిన సిబ్బంది వారి సంరక్షణలో ఎన్‌ఐసీయూలో ఉంచి బాగోగులు చూస్తున్నారు. రెండు రోజులు గడిచినా ఎవరూ రాకపోవడంతో వైద్యశాల ఆర్‌ఎంవో డాక్టర్‌ సురేష్‌కుమార్, స్టాఫ్‌ నర్స్‌ రజియా.. త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువుకు అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నాడని డాక్టర్‌ సురేష్‌ పోలీసులకు స్పష్టం చేశారు. ఎస్‌ఐ జె. శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువును బుధవారం గుంటూరులోని చైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ అధికారులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు త్రీ టౌన్‌ సీఐ ఎ. అశోక్‌కుమార్‌ను 94407 96274, తనను 99495 91299 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement