ఇంటర్‌లో ఫెయిలవుతాననే ఆందోళనతో ఆత్మహత్య | inter student in commited sucide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిలవుతాననే ఆందోళనతో ఆత్మహత్య

Published Wed, Apr 20 2016 9:39 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఇంటర్‌లో ఫెయిలవుతాననే ఆందోళనతో ఆత్మహత్య - Sakshi

ఇంటర్‌లో ఫెయిలవుతాననే ఆందోళనతో ఆత్మహత్య

పాలకుర్తి : ఇంటర్మీడియట్‌లో తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన బెల్లి కుమార్-యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానంలో చిన్న కూతురు సోమలక్ష్మి(17) హన్మకొండలో ఇంటర్మీడియట్ చదవుతోంది. తన అక్క, అన్నయ్యలు చదువులో బాగా రాణిస్తున్నారని, తాను ఇంటర్‌లో ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనచెందింది.

రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు వెలువడనుండడంతో సోమలక్ష్మిలో ఆందోళన ఎక్కువైంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement