విజయవాడ: ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారథి, జోగి రమేష్ అన్నారు. ముద్రగడ దీక్ష చేసినా, మంత్రి కొడుకు తప్పులు చేసినా వైఎస్ జగనే కారణమని చెప్పడం సరికాదని వారు అన్నారు.
ప్రభుత్వం అసమర్థతను ప్రతిపక్షం ఎత్తిచూపడాన్ని జీర్ణించుకోలేకపోతుందని చెప్పారు. ప్రతిపక్షంపై అధికార పక్ష నేతల ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. రాజధాని భూదందాపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
'ఏపీ ప్రభుత్వానికి జగన్ ఫోబియా'
Published Sun, Mar 6 2016 6:15 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement