ప్రతీ ఒక్కరికి జన్‌ధన్ ఖాతా..
జైనథ్ : బ్యాంకు ఖాతాలు లేని ప్రతి ఒక్కరు జన్‌ధన్ ఖాతాలు తీసుకోవాలని ఎస్‌బీఐ ఆదిలాబాద్ టౌన్ బ్రాంచ్ బిజినెస్ కరస్పాండెంట్ పవార్ అంబాజీ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని నిరాల గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన 60మంది కాంట్రాక్టు కూలీలకు జీరో బ్యాలెన్‌సతో జనధన్ ఖాతాలు తెరవడానికి ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్ వరకు ఏర్పాటు చేస్తున్న కొత్త కరెంట్ లైన్ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు ఖాతాలు తెరవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.
అయితే వీరందరికి కూడ వారం రోజుల్లో బ్యాంకు ఖాతతో పాటు దేశంలో ఎక్కడైన చెల్లుబాటు అయ్యేలా రూపే డెబిట్ కార్డులను అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతో ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాత, కార్డులు తప్పనిసరిగా మారడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.